fbpx
Home Cinema అనీషాతో విశాల్ పెళ్లి ర‌ద్ద‌వ్వ‌లేదు

అనీషాతో విశాల్ పెళ్లి ర‌ద్ద‌వ్వ‌లేదు

విశాల్-అనీషా పెళ్లిపై జీకె రెడ్డి కామెంట్

విశాల్-అనీషాల ప్రేమ వివాహంలో క‌ల‌త‌లు ఏర్ప‌డ్డాయ‌ని , ఎంగేజ్ మెంట్ త‌ర్వాత యూట‌ర్న్ తీసుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్ర‌చారం సాగిన సంగ‌తి తెలిసిందే. వీటిపై అనీషా గానీ, విశాల్ గానీ స్పందించ‌క‌పోవ‌డంతో నిజ‌మేన‌ని న‌మ్మాల్సిన ప‌రిస్థితి ఎదురైంది. అప్ప‌టివ‌ర‌కూ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన విశాల్- అనీషా ఎంగేజ్ మెంట్ ఫోటోలు కూడా డిలీట్ అవ్వ‌డంతో అంతా డైలామాలో ప‌డ్డారు. కొంత మంది సెల‌బ్రిటీల జీవితాల్లో  ఇలాంటివి కామ‌న్ గా జ‌రిగేవేనని గ‌త అనుభ‌వాల నేప‌థ్యంలో క‌థ‌నాల‌కు మ‌రింత బ‌లం చూకూరుంది. తాజాగా ఈ  రూమ‌ర్ల‌పై విశాల్ తండ్రి జీ.కె రెడ్డి  `ద‌మ‌యంతి` చిత్ర ప్రమోష‌న్ లో భాగంగా స్పందించారు.

విశాల్- అనీషా పెళ్లి నిర్ణ‌యించిన ప్ర‌కారం జ‌రుగుతుందన్నారు. అందులో ఎలాంటి మార్పు లేదు. సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న‌వన్ని క‌ట్టు క‌థ‌నాలు. పెళ్లి తేదీని ఇంకా నిర్ణ‌యించ‌లేదు. పెళ్లి మాత్రం క‌చ్చితంగా న‌డిగ‌ర్ సంఘం నూత‌న భ‌వ‌నంలో నే జ‌రుగుతుంద‌ని పున‌రుద్ఘాటించారు. న‌డిగ‌ర్ సంఘం ఎన్నిక‌లు ఓట్ల  లెక్కింపును కోర్టు నిలిపివేసిందిని..ఆ ఫ‌లితాలు వెల్ల‌డిస్తే  విశాల్ జ‌ట్టు గెలుస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. విశాల్ స్వ‌యంగా భ‌వ‌న నిర్మాణాన్ని పూర్తి చేస్తార‌ని తెలిపారు. అలాగే రాధికా శ‌ర‌త్ కుమార్ తో ఎలాంటి విబేధాలు లేవ‌ని, వారు కూడా త‌మ కుటుంబ స‌భ్యులేన‌ని తెలిపారు.

 

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ