fbpx
Home Cinema బన్ని, త్రివిక్రమ్ టైటిల్ ఇదా, చాలా వింతగా ఉందే

బన్ని, త్రివిక్రమ్ టైటిల్ ఇదా, చాలా వింతగా ఉందే

అల్లు అర్జున్, త్రివిక్రమ్ చిత్రం టైటిల్ ఇదేనట

స్టార్ హీరోల సినిమాల గురించి వచ్చే ప్రతీ అంశం హైలెట్ అవుతూంటుంది. అందుకే మీడియాలో వాళ్ల గురించి ఎప్పుడూ వార్తలు వస్తూంటాయి. అందులో కొన్ని నిజాలు ఉంటే, మరికొన్ని రూమర్స్ ఉంటాయి. మరీ ముఖ్యంగా ఫలానా టైటిల్ పెట్టబోతున్నారట అనేది ప్రతీ హీరో సినిమాకు ముందు కనిపించే అంశమే. తాజాగా స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రకరకాల టైటిల్స్ టాలీవుడ్‌లో వినిపిస్తున్నాయి.

ఈ సినిమా ఫాదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతుందని అందుకే ఈ సినిమాకు నాన్న నేను అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టుగా ప్రచారం జరిగింది. తరువాత అలకనంద అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్‌ వినిపించింది. తాజాగా మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌ తెర మీదక వచ్చింది. ఈ సినిమాకు ‘వెంకటాపురంలో’ అనే పేరును పరిశీలిస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ టైటిల్ వింటూంటే మరీ విచిత్రంగా ఉందని, అల్లు అర్జున్ లాంటి హీరో సినిమాకు అలాంటి టైటిల్ ఎందుకు పెడతారు, ఇది కేవలం రూమరే అంటున్నారు కొందరు.

అయితే తన ప్రతీ సినిమా టైటిల్‌ విషయంలో కొత్తగా ఆలోచించే త్రివిక్రమ్‌ ఈ సినిమాకు కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యే ఈ టైటిల్ ని ఫిక్స్ చేసాడని మరికొంతమంది అంటున్నారు. ఏదైమైనా… టైటిల్‌ను స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే మరో నలభై ఎనిమిది గంటల్లో టైటిల్‌ విషయంలో క్లారిటీ రానుంది.

అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చాలా కాలం తరువాత బాలీవుడ్ నటి టబు ఈ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}