fbpx
Home Cinema ఎక్సక్లూజివ్: బన్ని, త్రివిక్రమ్ ఫైనల్ చేసిన టైటిల్ ఇదే

ఎక్సక్లూజివ్: బన్ని, త్రివిక్రమ్ ఫైనల్ చేసిన టైటిల్ ఇదే

అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఫైనల్ చేసిన టైటిల్  

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి రకరకాల టైటిల్స్ టాలీవుడ్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫాదర్‌ సెంటిమెంట్‌ నేపథ్యంలో తెరకెక్కుతుందని అందుకే ఈ సినిమాకు నాన్న నేను అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్టుగా ప్రచారం జరిగింది. తరువాత అలకనంద అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారన్న టాక్‌ వినిపించింది.ఈ రోజు మరో ఇంట్రస్టింగ్ టైటిల్‌ తెర మీదక వచ్చింది. ఈ సినిమాకు ‘వెంకటాపురంలో’ అనే పేరును పరిశీలిస్తున్నారని అన్నారు.

అయితే ఫైనల్ ఈ చిత్రం టైటిల్ రివీల్ అయ్యింది. ‘ అల వైకుంఠ పురంబులో’ …ఈ టైటిల్ నే ఈ సినిమాకు ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ టైటిల్ చూస్తూంటే ఓ విధమైన ఫీల్ మన మనస్సులో కలుగుతుంది. అదే ప్లస్ పాయింట్ కానుంది.

తన ప్రతీ సినిమా టైటిల్‌ విషయంలో కొత్తగా ఆలోచించే త్రివిక్రమ్‌ ఈ సినిమాకు కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యే ఈ టైటిల్ ని ఫిక్స్ చేసాడని మరికొంతమంది అంటున్నారు. ఏదైమైనా… టైటిల్‌ను స్వాతంత్ర్యదినోత్సవ కానుకగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అంటే మరో నలభై ఎనిమిది గంటల్లో టైటిల్‌ విషయంలో క్లారిటీ రానుంది.

అల్లు అర్జున్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. చాలా కాలం తరువాత బాలీవుడ్ నటి టబు ఈ సినిమాతో టాలీవుడ్‌కు రీ ఎంట్రీ ఇస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ