Home Cinema 2020 టార్గెట్‌: టాలీవుడ్‌పై కిలాడీ క‌న్ను

2020 టార్గెట్‌: టాలీవుడ్‌పై కిలాడీ క‌న్ను

నార్త్ – సౌత్ మార్కెట్లు మెర్జింగ్

బాలీవుడ్‌లో ఖాన్‌లను మించిన‌ బిజీ స్టార్ ఎవ‌రు? అంటే క‌చ్ఛితంగా అక్ష‌య్‌కుమార్ పేరు వినిపిస్తుంది. ఆర్మీ నేప‌థ్యం ఉన్న కుటుంబం నుంచి వ‌చ్చిన స్టార్ అత‌డు. ద‌శాబ్ధాల పాటు ప‌రిశ్ర‌మ‌ను ఏల్తున్నాడు. లేటు వ‌య‌సులోనూ ప‌ర్ఫెక్ట్ ఫిజిక‌ల్ ఫిట్ నెస్ ఉన్న స్టార్ గా సంచ‌ల‌నాలు సృష్టిస్తున్నాడు. బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో బాక్సాఫీస్ వ‌ద్ద‌ హంగామా సృష్టిస్తున్న అక్ష‌య్ ఇటీవ‌ల త‌మిళ సూప‌ర్‌స్టార్ న‌టించిన `2.ఓ` చిత్రంతో త‌మిళ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విష‌యం తెలిసిందే. అక్ష‌య్ న‌టించిన తొలి ద‌క్షిణాది చిత్ర‌మిది. ఈ సినిమా త‌రువాత అక్ష‌య్ ద‌క్షిణాదిపై మ‌న‌సుప‌డిన‌ట్టున్నాడు. తెలుగులోనూ న‌టించ‌డానికి రెడీ అంటూ సంకేతాలిస్తున్నాడు. అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న తాజా చిత్రం `హౌస్‌ఫుల్-4`. అక్ష‌య్‌తో పాటు రానా, పూజా హెగ్డే, రితేష్ దేశ్‌ముఖ్‌, కృతిస‌న‌న్‌, కృతిక‌ర్బందా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది.

ఈ చిత్ర ప్ర‌చారంలో భాగంగా హైద‌రాబాద్ వ‌చ్చిన అక్ష‌య్‌కుమార్ మీడియాతో ఆస‌క్తిక‌ర విష‌యాల్ని పంచుకున్నారు. తెలుగు సినిమాల్లో న‌టించాల‌ని వుంద‌ని, ఎవ‌రైనా మంచి క‌థ‌తో వ‌స్తే త‌ప్ప‌కుండా న‌టిస్తాని వెల్ల‌డించారు. త‌న‌కు తెలుగు భాష రాద‌ని, అయితే నేర్చుకుని న‌టించ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని, ద‌క్షిణాదికి చెందిన ద‌ర్శ‌కులైన శంక‌ర్‌, ప్రియ‌ద‌ర్శ‌న్. మురుగ‌దాస్ వంటి ద‌ర్శ‌కుల‌తో క‌లిసి పనిచేశాన‌ని, వాళ్ల టైమ్ మేనేజ్ మెంట్‌, స‌మ‌య పాలన అంటే నేను చాలా ఇష్ట‌ప‌డ‌తాన‌ని, మంచి పాత్ర ఇస్తే త‌ప్ప‌కుండా తెలుగులో న‌టించ‌డానికి నాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని అక్ష‌య్‌కుమార్ చెప్పుకొచ్చారు. మ‌రి అక్ష‌య్ న‌టించాలంటే పెద్ద రేంజు స్క్రిప్టుల్నే  రెడీ చేయాల్సి ఉంటుంది. 2020 టార్గెట్ గా కిలాడీ కోసం మ‌న దర్శ‌క‌నిర్మాత‌లు క‌థ‌ల్ని వండుతున్నారేమో చూడాలి.

 
 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ