fbpx
Home Cinema అఖిల్ నెక్స్ట్ డైరెక్టర్ కన్ఫామ్ !

అఖిల్ నెక్స్ట్ డైరెక్టర్ కన్ఫామ్ !

అక్కినేని అఖిల్ కెరీర్‌లో మంచి కమర్షియల్ విజయం కోసం తపిస్తున్నారు. నటుడిగా ప్రతిభను నిరూపించుకున్నప్పటికి బాక్సాఫీస్ వద్ద ఆయన సినిమాలు ఆశించిన విజయాల్ని దక్కించుకోలేకపోయాయి. దీంతో ప్రస్తుతం కథాంశాల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్నాడు అఖిల్. ప్రస్తుతం ఆయన బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం అఖిల్ మరో సినిమా ఖరారైంది. ఈ చిత్రానికి గీత గోవిందం చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి తెలుసుకున్న నాగార్జున అందులోని కొత్తదనం నచ్చడంతో ఓకే చేశారని సమాచారం. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ