fbpx
Home Cinema ‘పహిల్వాన్‌’కి సల్మాన్‌ఖాన్ అభినందనలు

‘పహిల్వాన్‌’కి సల్మాన్‌ఖాన్ అభినందనలు

శాండిల్‌వుడ్ బాద్షా సుదీప్‌ తాజాగా మల్లయుద్ధ యోధుడిగా నటిస్తున్న చిత్రం ప‌హిల్వాన్‌. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ప‌హిల్వాన్‌ అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను 5 భాషల్లోవిడుదల చేశారు. ట్రైలర్‌లో సుదీప్ లుక్, ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలు, సంభాషణలతో ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది.

ఈ నేపథ్యంలో ఇటీవల ట్రైలర్‌ను వీక్షించిన సల్మాన్ ఖాన్ సుదీప్‌ను కలుసుకున్నప్పుడు సినిమా గురించి ప్రస్తావించి ట్రైలర్, మేకింగ్, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బావుందని సుదీప్ సహా మొత్తం బృందాన్ని అభినందించారు. దీని పై చిత్ర యూనిట్ ఆయనకు ప్రత్యేకమైన
కృతజ్ఞతలను తెలియజేసింది ఈ చిత్రానికి ఎస్‌.కృష్ణ దర్శకుడు. ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కె.జి.య‌ఫ్‌ చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు ప‌హిల్వాన్‌ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న ఘనంగా విడుదల చేస్తున్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ