fbpx
Home Cinema నాగ సౌర్య కొత్త చిత్రం ప్రారంభం

నాగ సౌర్య కొత్త చిత్రం ప్రారంభం

హీరో నాగ సౌర్య ఒకదాని తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు. తాజాగా ఆయన కొత్త చిత్రం ‘సుబ్రమణ్యపురం’ దర్శకుడు జాగర్లపూడి సంతోష్ దర్శకత్వంలో, శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి మరియు నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిన్న హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభం అయింది. అల్లుఅరవింద్‌ క్లాప్‌ నివ్వగా, సూపర్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు కెమెరా స్విచాన్‌ చేశారు.

చిత్ర బృందం మాట్లాడుతూ ‘ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా. ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ పై పని చేస్తున్నారు. తప్పకుండా అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాం. సంతోష్ కి ఇది రెండవ చిత్రం. తప్పకుండా హిట్ అవుతుంది. అలాగే మా హీరో నాగ సౌర్య కూడా ఈ చిత్రంతో మరో హిట్ అందుకుంటారని ఆశిస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుంది’ అని నిర్మాత శరత్ మరార్ తెలిపారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ