fbpx
Home Cinema కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’టీజర్

కళ్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’టీజర్

టీజర్ ఇంట్రస్టింగ్..సినిమా ఎలా ఉంటుందో కానీ..

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా చేస్తున్న తాజా చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయ్యింది. వేగేశ్న సతీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా చేస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ టీజర్ ను కట్ చేయటం బాగుంది. సినిమాలో కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు కళ్యాణ్ రామ్ ను ఒక్కొక్కరు ఒక్కోరకంగా పిలుస్తూ.. మంచివాడు అని చెప్తుంటారు. ఇందిలో కళ్యాణ్ రామ్ పేరు బాలు.

 ‘మా మనవడు శివ మంచోళ్లకే మంచివాడు. నా కొడుకు ఆచార్య చాలా మంచివాడు. మా అల్లుడు బాలు చాలా మంచివాడు. నా తమ్ముడు సూర్య ఎంత మంచోడో. నా అన్నయ్య రుషి చాలా మంచోడు. నా హీరో బాలు చాలా మంచోడు..’ అంటున్నారు.

ఒక్కొక్కరు ఒక్కో రకమైన పేరుతో పిలుస్తూ.. మంచి వాడు అని చెప్తుంటే.. బ్యాక్ గ్రౌండ్ లో ఫైట్ జరుగుతుంటుంది. అందరు మంచివాడు మంచి వాడు అంటుంటే.. నువ్వెంట్రా అలా కొడుతున్నావ్ అని అంటే.. ‘రాముడు కూడా మంచోడేరా.. కానీ రావణాసురుడిని వేసెయ్యలా’ అని చెప్పడంతో సినిమా ఎలాంటి కథతో ఉండబోతోందని అని క్లూ ఇచ్చినట్లైంది.

అలాగే చివర్లో మళ్ళీ ఎప్పుడు వస్తావ్ అని భరణి అడిగితె సంక్రాంతికి నాన్న అని చెప్పడం వెనుక సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అర్ధం అవుతున్నది. టీజర్ కూల్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే విధంగా ఉంది. ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్త నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో కల్యాణ్‌ రామ్‌కు జంటగా మెహరీన్‌ నటిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ