Home Cinema ఏదీ హ‌డావుడి.. ద‌స‌రా సినిమాల‌ సంద‌డే లేదు!

ఏదీ హ‌డావుడి.. ద‌స‌రా సినిమాల‌ సంద‌డే లేదు!

టాలీవుడ్ లో ద‌స‌రా సెంటిమెంట్ గురించి చెప్పాల్సిన ప‌నేలేదు. కొత్త సినిమాల ఓపెనింగులు ఓవైపు.. రిలీజ్ లు మ‌రోవైపు .. ఒక‌టే హ‌డావుడిగా ఉంటుంది. ఈ ద‌స‌రాకి దాదాపు అర‌డ‌జ‌ను పైగా సినిమాల ఓపెనింగులు చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. అలాగే ఓ అర‌డ‌జ‌ను చిత్రాలు ద‌స‌రా.. దీపావ‌ళి కానుక‌గా రిలీజ‌వుతున్నాయి. అయితే గ‌తంలో ద‌స‌రా, దీపావ‌ళి సంద‌డి ఈసారి క‌నిపించ‌డం లేదు. ఇంత‌కుముందులా భారీ చిత్రాల సంద‌డి లేనే లేదు. ఈ ద‌స‌రా బ‌రిలో చిన్ని సినిమాల‌తో పాటు దీపావ‌ళికి విజ‌య్‌, కార్తి న‌టించిన విజిల్‌, ఖైదీ వంటి చిత్రాలు వ‌స్తున్నా పెద్ద‌గా సంద‌డి క‌నిపించ‌డం లేదు. దీనికి కార‌ణం.. ప్ర‌చారం విష‌యంలో కూడా మేక‌ర్స్ దృష్టిపెట్ట‌న‌ట్టుగా క‌నిపిస్తోంది. పెద్ద స్టార్స్ చిత్రాలే అయినా రిలీజ్ జోష్ మాత్రం ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఈ రెండు డ‌బ్బింగ్ చిత్రాల‌తో స్ట్రెయిట్ చిత్రాలు భారీ స్థాయిలోనే పోటీకి సై అంటున్నాయి.  
 
కానీ వాటికి ఏ మాత్రం బ‌జ్ లేక‌పోవ‌డంతో ఈ పండ‌గ‌ల‌ సీజ‌న్ సినిమాల‌కు పెద్ద‌గా క‌లిసివ‌చ్చే అవ‌కాశాలేవీ క‌నుచూపు మేర‌లో క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ వాతావ‌ర‌ణం చిరు `సైరా`కు బాగానే క‌లిసి వ‌చ్చేలా వుంద‌ని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.  ద‌స‌రా, దీపావ‌ళి బ‌రిలో మొత్తం ప‌ది చిత్రాలు పోటీప‌డుతున్నాయి. ఈ శ‌నివారం యాక్ష‌న్ హీరో గోపీచంద్ స్పై థ్రిల్ల‌ర్ `చాణ‌క్య‌` ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. న‌వీన్ విజ‌య‌కృష్ణ న‌టించిన `ఊరంతా అనుకుంటున్నారు` చిత్రం కూడా ఇదే రోజు విడుద‌లైంది. ఈ రెండూ యావ‌రేజ్ టాక్‌ని సొంతం చేసుకున్నాయి. ఈనెల 8న అంటే ద‌స‌రా రోజు `ఎవ్వ‌రికి చెప్పొద్దు` విడుద‌ల కాబోతోంది. క్యాస్టిజ‌మ్ నేప‌థ్యంలో అ చిత్రాన్ని రూపొందించిన‌ట్టు క‌నిపిస్తోంది. అయితే ఈ సినిమాల‌కు స‌రైన ప్ర‌మోష‌న్ లేక జ‌నాల‌కు పెద్ద‌గా నోటీస్ కాలేదు.
 
 

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ