fbpx
Home Cinema ఎన్టీఆర్ బయోపిక్..కీరవాణి షాకింగ్ స్కెచ్

ఎన్టీఆర్ బయోపిక్..కీరవాణి షాకింగ్ స్కెచ్

నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా నందమూరి బాలకృష్ణ టైటిల్‌ రోల్‌ పోషిస్తూ,నిర్మిస్తున్న చిత్రం ‘యన్‌.టి.ఆర్‌’.ప్రముఖ దర్శకుడు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంభందించి రోజుకో వార్త లేదా పోస్టర్ విడుదల అవుతూ సినిమాపై క్రేజ్ ,మోజు పెంచుతున్నాయి. తాజాగా ఈ చిత్రం గురించిన ఓ కొత్త వార్త బయిటకు వచ్చింది. ఈ సినిమాలో 12 పాత పాటలు ఉండబోతున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ కెరీర్ లో సూపర్ హిట్స్ అనదగ 12 పాత పాటలను తీసుకుని కీరవాణి తిరిగి వాటిని ట్యూన్స్ కట్టారట. వాటి నేపధ్యంలో ఎన్టీఆర్ జీవత కథ ని క్రిష్ నేరేట్ చేయబోతున్నట్లు సమాచారం. దాదాపు అన్ని పాటలు ఫస్ట్ పార్ట్ లోనే వచ్చే అవకాసం ఉంది.

కాబట్టి పాత పాటలను ఇష్టపడేవారికి ఈ సినిమా పండగ చేయబోతోందన్నమాట. ఇక ఇదంతా కీరవాణి ఆలోచన అని తెలుస్తోంది. ఎన్టీఆర్ హిట్ సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆ రోజుల్లోకి తీసుకు వెళ్లటానికి అంతకు మించిన మార్గం మరొకటి లేదని క్రిష్ ని ఒప్పించారట. 

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 9న ‘కథానాయకుడు’ పేరుతో విడుదల కానుంది. ఎన్టీఆర్‌ సినీ కెరీర్‌ ప్రారంభం నుంచి ముఖ్యమంత్రి అయ్యే వరకూ జరిగిన సంఘటనలకు దీనిలో దృశ్యరూపం ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక సీఎం అయిన దగ్గరి నుంచి ఆయన మరణించే వరకూ చోటు చేసుకున్న సంఘటనలను ‘మహానాయకుడు’ పేరుతో పిబ్రవరి 7 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై నందమూరి బాలకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సమర్పిస్తున్నాయి. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ