Home Cinema సూపర్ హిట్ అయితేనే నిద్ర లేపండి: నాని

సూపర్ హిట్ అయితేనే నిద్ర లేపండి: నాని

నాని ఫన్నీ రిక్వెస్ట్..ఫ్యాన్స్ నవ్వుకుంటున్నారు

చాలా నెలలుగా నిర్మాణంలో ఉన్న నాని గ్యాంగ్ లీడర్ ఈ రోజు రిలీజైంది. ఆల్రెడీ యుఎస్ లో ప్రీమియర్స్ పడ్డాయి. రిపోర్ట్ లు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో నాని తన ట్విట్టర్ పేజీలో ఓ ఫన్నీ ట్వీట్ ని వేసారు. తన గ్యాంగ్ లీడర్ సినిమా సెట్ లో తీసుకున్న ఓ ఫొటో ని షేర్ చేసారు. సీనియర్ నటి లక్ష్మి భుజంపై తలవాల్చి నిద్రపోతున్న నాని ఫొటో అది.

దాని క్రింద కాప్షన్ ఇలా రాసారు ”గ్యాంగ్ లీడర్ హిట్ ఐతే లేపండి, లేకుంటే డిస్ట్రబ్ చెయ్యొద్దు, గ్యాంగ్ లీడర్ మీ మూవీ, మీకు బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను, మీ పెన్సిల్ పార్థసారథి”.ఈ ట్వీట్ ని ఫ్యాన్స్ తెగ మెచ్చుకుని షేర్ చేస్తున్నారు. ఫన్ నీ సినిమాల్లాగానే చాలా న్యాచురల్ గా ఉందని అంటున్నారు. ఈ సినిమాలో నాని రైటర్ పెన్సిల్ పార్ధసారధిగా కనిపించారు.

‘జెర్సీ’తో బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని అందుకున్నారు యంగ్ హీరో నాని. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘గ్యాంగ్‌లీడర్‌’. ఈ చిత్రం ఈ రోజు (సెప్టెంబరు 13న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేఫధ్యంలో నాని చేసిన ఓ ఫన్నీ ట్వీట్ ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.

నాని మాట్లాడుతూ… గ్యాంగ్ లీడర్ స్క్రీన్ ప్లే గందరగోళం ఏమీ ఉండదు. చాలా సింపుల్‌ సినిమా. కీలక మలుపులు, ఊహించని ట్విస్ట్‌లు ఉన్నా అవన్నీ అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి. మిమ్మల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. అదే సమయంలో అస్సలు గందరగోళంగా ఉండదు. ఇందులోనే పెన్సిల్‌ పార్థసారథి అనే రచయితగా కనిపిస్తా. చాలా రివేంజ్‌ డ్రామా స్టోరీలు రాసినా, అవేవీ అమ్ముడుపోవు అన్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ