fbpx
Home Cinema రోజాతో యంగ్‌స్టార్...జంట జ‌బ‌ర్ద‌స్త్‌

రోజాతో యంగ్‌స్టార్…జంట జ‌బ‌ర్ద‌స్త్‌

ఏడేళ్లుగా తెలుగు టీవీ షోలలో పాపులర్ షోగా దూసుకుపోతోంది. జబర్దస్త్ షో ఓ నవ్వుల సంచలనం. తెలుగు టీవీ తెర పై ఎన్నో చరిత్రలు సృష్టించిన షో అది. ఈ షో లో ఒక్క స్కిట్ చేసినా చాలు అనుకునే ఔత్సాహికులు ఎందరో. స్కిట్ లలో చిన్న పాత్ర వేయడానికి వచ్చి.. తమ టాలెంట్ తో టీమ్ లీడర్స్ గా ఎదిగిన కళాకారులు ఎందరో ఉన్నారు జబర్దస్త్ లో. జబర్దస్త్ ప్రారంభం నుంచి తన చిరునవ్వుతో న్యాయనిర్ణేతగా ఇటు ప్రేక్షకుల్లోనూ, అటు షో లో నటించే వారిలోనూ ఎంతో పేరు తెచ్చుకున్న నాగబాబు జబర్దస్త్ నుంచి తప్పుకున్నారు. దానికి కారణాలు ఏమైనా.. గత రెండు వారాల నుంచి రోజా ఒక్కరే షో నడిపించారు. అయితే నాగబాబు ప్లేస్‌ను రీ ప్లేస్ చేసేందుకు జడ్జిగా అలీ, నరేష్, సాయి కుమార్, మీనా ఇలా చాలా పేర్లు వినిపించాయి.

ప్ర‌స్తుతం జ‌బ‌ర్ద‌స్త్ కొత్త ట్రెండ్‌ని ఫాలో అవుతుంది. నాగ‌బాబు ప్లేసుని రీ ప్లేస్ చెయ్య‌కుండా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్న సినిమాలోని హీరోల‌ను జ‌డ్జిలిగా తీసుకుంటుంది. ఇటు వీళ్ళ‌కు జ‌డ్జి అటు వాళ్ల‌కు సినిమా ప్ర‌మెష‌న్ రెండూ అయిపోతున్నాయి. గతవారం నిఖిల్ ‘అర్జున్ సురవరం’ మూవీ ప్రమోషన్స్‌కి రాగా.. వచ్చే వారానికి సంబంధించి 90 ML మూవీ హీరో కార్తికేయ జబర్దస్త్ జడ్జిగా రోజా పక్కన ప్లేస్ కొట్టేశారు.

ఇక వ‌చ్చే వారం కాస్త జ‌బ‌ర్ద‌స్థ్ హ‌డావుడిగానే ఉండ‌బోతుంది. దేవుడైన జీవుడైన రిక్షవోడురా.. అంటూ అనసూయ రిక్షాలో ఎక్కించుకుని హైపర్ ఆది మెలికలు తిరుగుతూ మెగాస్టార్ స్పెప్పులు వేస్తున్నాడు. రిక్షా తొక్కి తొక్కి అలసిపోయిన ఆది రిక్షాను ఆపడంతో చూస్తున్నావ్ ఏంటి.. పదా అని అనసూయ అనడంతో‘యాంకరింగ్ చేసి చేసి అలవాటు అయిపోయింది.. సీటు దొరికితే చాలు కూర్చుండిపోవడానికి.. వెనుక ఇంకొకరు వస్తేరని’ అంటూ పంచ్ చేశాడు. ఇలా కొన్ని వెరైటీ పంచ్‌ల‌తో హైప‌ర్ ఆది, అన‌సూయ ఆక‌ట్టుకున్నారు. ఇక జడ్జిగా వచ్చిన కార్తికేయ కూడా జబర్దస్త్ స్కిట్‌లో భాగమై పంచ్ పేల్చుతున్నాడు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ