fbpx
Home Cinema చిరంజీవిగారి ముందు డ్యాన్స్ చేస్తే హీరో అవ్వొచ్చు అనుకున్నా

చిరంజీవిగారి ముందు డ్యాన్స్ చేస్తే హీరో అవ్వొచ్చు అనుకున్నా

నిఖిల్‌, లావణ్య త్రిపాఠిలు హీరో హీరోయిన్లుగా థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న సినిమా అర్జున్‌ సురవరం. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా నిఖిల్‌ మీడియాతో మాట్లాడాడు. ఎన్నో అవాంతరాల తరువాత నిఖిల్ సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన అర్జున్‌ సురవరం ఈ శుక్రవారం (29-11-2019) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా హీరో నిఖిల్ ఈ సినిమాతో తన అనుబందాన్నీ, అనుభావాలను మీడియాతో పంచుకున్నాడు. సినిమా ఆలస్యానికి కారణాలను కూడా వెల్లడించాడు నిఖిల్‌.

సినిమాలలోకి రావడానికి మీకు చిరంజీవి స్ఫూర్తి అన్నారు, ఎలా?
ఒక సారి స్కూల్ చిల్డ్రన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కి చిరంజీవి గారు వచ్చారు. అప్పుడు నా ప్రదర్శన కూడా ఉంది. అప్పటికే చాలా సమయం కావడం వలన ఆయన నా ప్రదర్శన చూడకుండానే వెళ్లిపోయారు. నా డాన్సులు చూసి ఆయన నన్ను సినిమాలలోకి తీసుకెళతారేమో అనుకొనే వాడిని. అలా చిన్నప్పటి నుండి నాకు హీరో అంటే చిరంజీవి.
 
దర్శకుడు టి సంతోష్ గురించి చెప్పండి?
ఆయన ఒక రాక్షసుడు, తనకు కావలసినది రాబట్టేవరకు వదిలిపెట్టేవారు కాదు. ప్రమాదాలు, దెబ్బలు తగులుతాయి అనేవి ఆయన పట్టించుకోరు. ఒకే షాట్ ని అనేక టేక్ లు చేయించేవారు. వాళ్ళ నాన్న గారు జర్నలిస్టు, అందుకే ఆయనకు జర్నలిజంపై మంచి అవగాహన ఉంది.
 
భవిష్యత్తులో ఏమేమి చిత్రాలు చేస్తున్నారు?
 కార్తికేయ 2 మూవీ వచ్చే నెల 20 నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. ఇక దర్శకుడు వి ఆనంద్ తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మూవీ చేస్తున్నాను. అలాగే ‘హనుమాన్’ అనే ఒక మూవీ చర్చల దశలో ఉంది. ప్రస్తుతానికి ఈ మూడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాను.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ