fbpx
Home Cinema 'గ్యాంగ్ లీడర్' డైరక్టర్ లవర్ ఆమె అని తేల్చారు

‘గ్యాంగ్ లీడర్’ డైరక్టర్ లవర్ ఆమె అని తేల్చారు

విక్రమ్ కుమార్ సెంటిమెంట్ గురించే డిస్కషన్

సినిమావాళ్ల ఒక్కొక్కరికీ ఒక్కో వెరైటీ సెంటిమెంట్ ఉంటుంది. కొంతమంది టైటిల్ విషయంలో ఉంటే మరికొందరకి లొకేషన్ సెంటిమెంట్ ఉంటుంది. అలాగే తాజాగా రిలీజైన నానీస్ గ్యాంగ్ లీడర్ డైరక్టర్ కు తన ప్రతీ సినిమాలోనూ హీరోయిన్ కు ప్రియ అని పేరు పెట్టడం జరుగుతోంది. విక్రమ్ కు ’13B’ సినిమా నుండి మొదలైందన ఈ ప్రియ సెంటిమెంట్…. ‘ఇష్క్’..’మనం’.. ’24’.. ‘హలో’ సినిమాలలో హీరోయిన్ పేరు అదే కావటం జరిగింది.

నిన్న రిలీజ్ అయిన ‘గ్యాంగ్ లీడర్’ లో కూడా హీరోయిన్ పాత్ర పేరు సేమ్ టు సేమ్. హీరోయిన్ మారింది కానీ హీరోయిన్ పాత్ర పేరు మారలేదు. దాంతో అసలు ప్రియ సెంటిమెంట్ వెనక కథేంటనేది చాలా మందికు ఆసక్తిగా మారింది. కొంతమంది ప్రియ పేరు విక్రమ్ కుమార్ గర్ల్ ఫ్రెండ్ పేరు అని అంటున్నారు. ఈ విషయమై విక్రమ్ చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. దాంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఇక గ్యాంగ్ లీడర్ సినిమా విషయానికి వస్తే.. సినిమా కాసేపు నవ్వుకోవటానికి బాగానే ఉన్నా…దర్శకుడు విక్రమ్ కుమార్.. కథ.. పాత్రల విషయంలో లాజిక్కుల గురించి పట్టించుకోకపోవడం నిరాశ కలిగించింది. తనకున్న సెపరేట్ ఐడెంటీని ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. అయితే స్క్రీన్ ప్లేలో మలుపులతో.. ఫన్నీ నరేషన్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. సెకండాఫ్ లో విక్రమ్ ప్రతిభ చాలా చోట్ల కనిపిస్తుంది. కానీ లూజ్ ఎండ్స్ చాలా ఉండటంతో సినిమాపై పూర్తి సదభిప్రాయం కలగదు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ