fbpx
Home Cinema ఇంట్రస్టింగ్ టీజర్, శ్రీవిష్ణుకి మరో హిట్ కన్ఫర్మ్

ఇంట్రస్టింగ్ టీజర్, శ్రీవిష్ణుకి మరో హిట్ కన్ఫర్మ్

తిప్పరా మీసం టీజర్‌

‘బ్రోచేవారెవరురా’ అంటూ రీసెంట్ గా హిట్‌ కొట్టిన శ్రీ విష్ణు.. మరో వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దమయ్యాడు. మొదట్నుంచీ నటనా ప్రాధాన్యమున్న చిత్రాలను ఎంచుకుంటోన్న శ్రీవిష్ణు.. విజయం సాధిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు తిప్పరా మీసం అంటూ మరో విభిన్న కథా చిత్రంతో త్వరలోనే రానున్నాడు. గురువారం ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు. ఇంట్రస్ట్ కలిగించేలా థ్రిల్లింగ్ గా టీజర్‌ను తీర్చిదిద్దారు. ఆ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

‘మందు.. సిగరెట్.. అమ్మాయిలా… శత్రువు కూడా ఒక వ్యసనమే. ఆ వ్యసనానికి నేను కూడా బానిసనే’ అంటున్నారు శ్రీ విష్ణు. కృష్ణ విజయ్‌ దర్శకుడు.మరి శ్రీవిష్ణు శత్రువు ఎవరు? అతడిని జయించడానికి ఏం చేశాడు? ఎందుకు మీసం తిప్పాల్సి వచ్చింది తదితర విషయాలు తెరపై చూడాల్సిందే! కృష్ణ విజయ్‌ ఎల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై రిజ్వాన్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేశ్‌ బొబ్బలి సంగీతం అందిస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ