Home Cinema ఆర్ ఆర్ ఆర్ పై వైర‌ల్ అవుతున్న వార్త‌లు... ఇవి ఎంత వ‌ర‌కు నిజం...!

ఆర్ ఆర్ ఆర్ పై వైర‌ల్ అవుతున్న వార్త‌లు… ఇవి ఎంత వ‌ర‌కు నిజం…!

 

టాలీవుడ్ నుంచి వస్తున్న మరో భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం “RRR”. దర్శక ధీరుడు రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో చేస్తున్న మహా యాగం ఇది. బాహుబలి లాంటి చిత్రం తర్వాత రాజమౌళి మొదలు పెట్టిన సినిమా కావడం అందులోను ఇద్దరు స్టార్ హీరోలతో కలిపి ఇలాంటి భారీ ఫిక్షనల్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీనితో ఈ సినిమాపై ఇప్పుడు ఏ చిన్న వార్త బయటకు వచ్చినా బాగా వైరల్ అయ్యిపోతుంది.

 

అలాగే ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది.ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయ్యిపోయిందని అలాగే చరణ్ సాంగ్ బీట్ కూడా పూర్తయ్యింది అని అలాగే ఎన్టీఆర్ మరియు రామ్‌చ‌ర‌ణ్ కు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయని వార్తలొస్తున్నాయి. అప్పుడే 80 శాతం షూటింగ్ అయ్యిపోయింది అంటే అది నిజంగానే నమ్మశక్యంగా లేదని చెప్పాలి. అందులోను రామ్ చరణ్ సాంగ్ అంటే అసలు నమ్మబుద్ది కావట్లేదు. అసలు ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో రాజమౌళి షూటింగ్ కోసం ఇలాంటి వార్తలన్నిటికి చెక్ పెడుతూ ఏదన్నా అప్‌డేట్ ఇస్తే బావుంటుంద‌ని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ