Home Cinema అనుష్క `నిశ్శ‌బ్దం` లో అలాంటి పాత్ర చేస్తుందా...?

అనుష్క `నిశ్శ‌బ్దం` లో అలాంటి పాత్ర చేస్తుందా…?

`అరుంధతి`, `బాహుబలి`, `రుద్రమదేవి`, `భాగమతి` వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `నిశ్శ‌బ్దం`. హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ బ్యాన‌ర్స్‌పై టీజీ విశ్వ‌ప్ర‌సాద్‌, కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ, ఇంగ్లీష్ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ క్రాస్ ఓవ‌ర్ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి ఈ చిత్రాన్ని జ‌న‌వ‌రి 31, 2020లో విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు నిర్మాత‌లు. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం జ‌రిగిన పాత్రికేయుల స‌మావేశంలో…

నిర్మాత కోన వెంక‌ట్ మాట్లాడుతూ – 2017లో ఈ క‌థ హేమంత్ మ‌ధుక‌ర్ రూపంలో న‌న్ను వెతుక్కుంటూ వ‌చ్చింది. నిన్నుకోరి సినిమా విష‌యంలోనూ అలాగే జ‌రిగింది. క‌థ మ‌నల్ని క‌దిలిస్తే .. అది సినిమా అవుతుంది. హేమంత్ చెప్పిన పాయింట్ విన్న నాకు అద్భుత‌మైన సినిమా అవుతుంద‌నే ఫీలింగ్ క‌లిగింది. ఇద్ద‌రం రెండేళ్లు ట్రావెల్ అయ్యాం. ఈ ప్ర‌యాణంలో అనుకోని మంచి ఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి. మేం న‌మ్మిన ఈ క‌థ‌ను ముందుకు తీసుకెళ్ల‌డానికి మాకు విశ్వ‌ప్ర‌సాద్‌గారు దొరికారు. మొత్తం సినిమాను అమెరికాలోనే చిత్రీక‌రించిన తొలి తెలుగు సినిమా ఇదేన‌ని అనుకుంటున్నాను. హాలీవుడ్ యాక్ట‌ర్స్‌, టెక్నీషియ‌న్స్ కూడా ఈ సినిమాకు పనిచేశారు. అలాంటి నిర్మాత దొర‌క‌డం వ‌ల్ల‌నే ఈ సినిమా సాధ్య‌మైంద‌ని భావిస్తున్నాను. ఏద‌డిగినా కాద‌న‌కుండా.. అదెయ్యంత వ‌ర‌కు మా వెనుక‌ప‌డ‌తారు. మంచి క్వాలిటీ ప్రొడ్యూస‌ర్‌. మ‌న టెక్నీషియ‌న్స్‌తో పాటు హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ కూడా ప‌నిచేయ‌డం వ‌ల్ల కొత్త విష‌యాల‌ను నేర్చుకున్నాం. ఇదొక ఎక్స్‌పెరిమెంట్ ప్రాజెక్ట్ అని చెప్ప‌లేను కానీ.. ఎగ్జాంపుల‌ర్ ప్రాజెక్ట్ అవుతుంద‌ని చెప్ప‌గ‌ల‌ను. మా టీజ‌ర్‌కు ఇంత రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. 20 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ అయ్యింది. అనుష్క చాలా సెల‌క్టివ్‌గా సినిమాలు చేసుకుంటుంది. ముందు ఈ సినిమాలో వేరే హీరోయిన్‌ను అనుకున్నాం. మాకు వీసాలు త‌దిత‌ర కార‌ణాల‌తో సినిమా డిలే అయ్యింది. మేం అనుకున్న హీరోయిన్‌కి ఈ సినిమాను చేయ‌లేన‌ని చెప్పేసింది. ముంబై నుండి వ‌స్తున్న స‌మ‌యంలో అనుష్క ఫ్లైట్‌లో క‌న‌ప‌డింది. మేం ప్రయాణించాల్సిన ఫ్లైట్ డిలే అయ్యింది. ఆ స‌మ‌యంలో నేను అనుష్క‌కి ఈ క‌థ చెప్పాను. త‌ను కూడా చాలా ఎగ్జ‌యిట్ అయ్యింది. ఓ వారం గ్యాప్ త‌ర్వాత త‌న‌ను నేను మ‌ళ్లీ అప్రోచ్ అయ్యాను. అప్పుడు త‌ను నేను సినిమా చేస్తాన‌ని చెప్పింది. ఈ సినిమాలో సుబ్బ‌రాజు వైల్డ్ లైఫ్‌ ఫోటోగ్రాఫ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నారు. ఇందులో అనుష్క చేసిన సాక్షి అనే అమ్మాయి పాత్ర మాట్లాడ‌లేదు. చెవులు విన‌ప‌డ‌వు. త‌న యాంగిల్‌లో క‌థ ర‌న్ అవుతుంది కాబ‌ట్టే ఈ సినిమాకు `నిశ్శ‌బ్దం` అనే టైటిల్‌ను పెట్టాం. `నిన్నుకోరి` త‌ర్వాత గోపీసుంద‌ర్ అంత గొప్ప ఆల్బ‌మ్‌ను ఈ సినిమాకు ఇచ్చాడు. ఈ క్రెడిట్ అంతా హేమంత్‌కే ద‌క్కుతుంది అన్నారు.

Bikini Show

Recent Galleries

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ