Home Andhra Pradesh Amaravathi చంద్రబాబు, చినబాబు అరెస్టు

చంద్రబాబు, చినబాబు అరెస్టు

చలో ఆత్మకూరు కార్యక్రమానికి పిలుపిచ్చిన  చంద్రబాబునాయుడు, చినబాబులను పోలీసులు హౌస్ అరెస్టయ్యారు.  గుంటూరు జిల్లా ఆత్మకూరు విలేజిలో టిడిపి కార్యకర్తలపై  వైసిపి నేతలు దాడులు చేస్తున్నారంటూ చంద్రబాబు గోల మొదలుపెట్టారు.   గ్రామాల్లో నుండి తరిమేసి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారంటూ గగ్గోలు పెడుతున్న విషయం అందరూ చూస్తున్నదే. వైసిపి బధితుల కోసం గుంటూరులో శిబిరం పెట్టి నానా హడావుడి చేస్తున్నారు.

ప్రభుత్వానికి నిరసనగా బుధవారం చలో ఆత్మకూరు కార్యక్రమం పెట్టుకున్నారు. దాంతో మంగళవారం నుండే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టిడిపి నేతలను చంద్రబాబు గుంటూరుకు పిలిపించారు. వచ్చిన వాళ్ళని వచ్చినట్లు ఇటు శిబిరానికి అటు ఆత్మకూరు గ్రామానికి పంపారు. దాంతో మొత్తం టెన్షన్ మొదలైంది.

ఎప్పుడైతే చిన్న విషయాన్ని కూడా చంద్రబాబు పెద్దదిగా చూపించటం మొదలుపెట్టారో అప్పుడు పోలీసులు మేలుకున్నారు. అప్పటి నుండి నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేశారు. ఇందులో భాగంగానే చంద్రబాబు, నారా లోకేష్ ను కూడా పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎప్పుడైతే చంద్రబాబు, చినబాబుతో పాటు నేతల హౌస్ అరెస్టులయ్యారో  వెంటనే గుంటూరు జిల్లాలో టెన్షన్ తారస్ధాయికి చేరుకుంది.

ఉద్దేశ్యపూర్వకంగానే చంద్రబాబు, టిడిపి నేతలు పోలీసులతో ఎక్కడికక్కడ వాగ్వాదాలకు దిగుతున్నారు. కావాలనే పరిస్ధితులను ఉద్రిక్తంగా మారుస్తున్నారు. దానికి మద్దతుగా ఎల్లోమీడియా ఆజ్యం పోస్తుండటంతో మెజారిటి మీడియాలో  చంద్రబాబు వాదనే బాగా హైలైట్ అవుతోంది. మొత్తానికి ఈ పరిస్ధితి ఎక్కడికి దారి తీస్తుందో చూడాల్సిందే.

 

Recent Post

గ‌ణేష్ ఆచార్య ఎంత‌ప‌ని చేశాడు!

గ‌ణేష్ ఆచార్య‌.. బాలీవుడ్‌లో టాప్ డ్యాన్స్ మాస్ట‌ర్. ఐదు వంద‌ల పైచిలుకు సినిమాల‌కు కొరియోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశారు. ఇప్ప‌టికీ డ్యాన్స్ మాస్ట‌ర్‌గా టాప్ పొజీష‌న్‌లో వున్నారు. అలాంటి వ్య‌క్తిపై తాజాగా మీటూ ఆరోప‌ణ‌లు రావ‌డం...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

ఆంధ్రాలో జిల్లాల విభజన షురూ !!

ఆంధ్ర ప్రదేశ్ లో కూడా కొత్త రచ్చ మొదలైంది. జిల్లాల విభజన పై క్యాబినెట్ నిర్ణయం తీసుకుందంటూ ఓ న్యూస్ ఓ ప్రముఖ పత్రిక ద్వారా పబ్లిష్ అవ్వడంతో .. ఈ రచ్చ...

రంగు పడింది: వైసీపీకి హైకోర్టు అక్షింతలు !!

జగన్ ప్రభుత్వం అతి కి బ్రేకులు వేసినట్టయింది. పార్టీ గెలిచింది కదా అని చెట్టుకు, పుట్టకు, మరుగుదొడ్లకు.. చివరికి కూడా వై సిపి పార్టీ రంగులతో నింపేసిన విషయం తెలిసిందే. అంతటితో...

దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయండి: బాబు

శాసన మండలిని రద్దు తీర్మానం చేయించిన జగన్ కు దమ్ముంటే అసెంబ్లీని కూడా రద్దు చేసి ప్రజలముందుకు రావాలని చంద్రబాబు సవాల్ చేసారు. ఈ సారి వై సిపి గెలిస్తే తాను రాజకీయాలనుండి...

Featured Posts

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....

ప్ర‌భాస్‌కు ఎంత పేరొచ్చినా అందుకు అర్హుడే!

అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం `అల వైకుంఠ‌పురములో`. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఇండ‌స్ట్రీ రికార్డ్స్‌ని తిర‌గ‌రాసి నాన్ బాహుబ‌లి రికార్డుల్ని స‌మం చేసింది. ఈ సంద‌ర్భంగా సోమ‌వారం...