చాల రోజులకు దర్శనమిచ్చిన రియా చక్రవర్తి

rhea

బాలీవుడ్ ఇండస్ట్రీలో గత ఏడాది సంచలనం సృష్టించిన విషయాల్లో డ్రగ్స్ వివాదం ఒకటి. అంతేకంటే ముందు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సూసైడ్ కేసు అందరిని షాక్ కు గురి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ వివాదంలో అనేక సమస్యలు ఎదుర్కొన్న హీరోయిన్ రియా చక్రవర్తి. సుశాంత్ కు ప్రేయసిగా ఉన్న ఆమె అనేక రకాల కేసులతో కొన్నాళ్ళు పోలీసుల విచారణతో సతమతమయ్యింది.  
అయితే చాలా రోజుల తరువాత రియా ముంబైలోని ఒక జిమ్ లో దర్శనమిచ్చింది.

rhea

అందుకు సంబందించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో  వైరల్ గా మారుతున్నాయి. సుశాంత్ సూసైడ్ కేసులో విచారణను ఎదుర్కొన్న అనంతరం ఆమె డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల పాటు కస్టడీలో ఉన్న ఆమె మొత్తానికి బెయిల్ ద్వారా బయటకు  వచ్చింది. ఇక ఎప్పటిలానే ఆమె మళ్ళీ బాలీవుడ్ లో హీరోయిన్ గా బిజీ అవ్వడానికి సిద్దమయ్యింది. గ్యాప్ లేకుండా వర్కవుట్స్ చేస్తూ ఫిట్నెస్ ను మెయింటైన్ చేస్తోంది.

ఆమె సోదరుడు శోవిక్ కూడా జైలు నుంచి బెయిల్ ద్వారా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఈ ఇద్దరు కూడా గత చేదు అనుభవాల నుంచి బయటపడుతూ జిమ్ వర్కౌట్స్ తో బిజీగా మారారు. ఇక కొంతమంది బీ టౌన్ కెమెరా మేన్స్ వారిని ఫొటోలు తీసేందుకు ప్రయత్నం చేయగా రియా ఏమి పట్టనట్లుగా వెళ్లిపోయింది. ఆమె సోదరుడు మాత్రం చిల్ అంటూ హావభావాలను చూపిస్తూ కెమెరాలకు పోజిచ్చాడు.