అరెరే.. అలియా! ఏది పట్టుకున్నా కాలుతోందే..?

ALIA

బాలీవుడ్ హాట్ బ్యూటీ అలియా భట్ లక్కేమిటో గాని ఇటీవల కాలంలో ఏది పట్టుకున్నా కూడా కాలుతోంది. సినిమాల విషయంలోనే కాకుండా పర్సనల్ గా కూడా ఈ ఏడాది ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సుశాంత్ సూసైడ్ అనంతరం ఆమె గతంలో చేసిన కామెంట్స్ ను గుర్తు చేస్తూ నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. నెపోటీజమ్ దెబ్బ ఒక్కసారిగా ఆమె మీద పడినట్లయ్యింది.

alia bhatt

ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గడమే కాకుండా ఆమె సడక్ 2 ట్రైలర్ కు రికార్డు స్థాయిలో అన్ లైక్స్ వచ్చాయి. ఇక ఇటీవల RRR షూటింగ్ లో పాల్గొన్నప్పుడు కూడా అలియా భట్ అల్లూరీ సీతారామరాజుకు జోడిగా నటించడం ఏమిటనే ట్రోల్స్ కూడా వచ్చాయి. ఆమె అసలు సీత పాత్రకు ఏ మాత్రం సెట్టవ్వదని ఒక ట్యాగ్ కూడా ట్రెండ్ అవ్వడం షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు ఆమె నటిస్తోన్న గంగూబాయ్‌ కతియావాడి సినిమా కూడా చిక్కుల్లో పడింది.

ముంబై మాఫియా రారాణి గంగూబాయి జీవితం ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. రెడ్ లైట్ ఏరియాల్లో ఆమె వ్యభిచారం నడిపిన అంశాన్ని కూడా సినిమాలో చూపించనున్నారట. అయితే ఆ సినిమా కారణంగా తమ కుటుంబానికి పరువు నష్టం కలుగుతోందని గంగూబాయి దత్త పుత్రుడు బాబూజీ రాజీ షా కోర్టుకెక్కారు. ఈ సినిమా డైరెక్టర్ సంజయ్‌ లీలా భన్సాలీతో పాటు మెయిన్ లీడ్ లో నటిస్తున్న అలియా భట్‌ పై కూడా కేసు నమోదైంది. బాంబే సివిల్‌ కోర్టులో కేసు దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఇక జనవరి 7లోగా చిత్ర యూనిట్ ఈ విషయంపై వివరణ ఇవ్వాలని న్యాయస్థానం కోరింది.