బావ కళ్ళలో ఆనందం కోసం.. సల్మాన్

ayush

బాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన సల్మాన్ ఖాన్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ మూడు వందల కోట్లు కొల్లగొట్టేలా ఉంటుంది. ఖాన్ త్రయంలో గత కొంత కాలంగా బాక్సాఫీస్ రారాజుగా కొనసాగుతున్నాడు సల్మాన్. కమర్షియల్ ఫార్మాట్ లోనే ఎక్కువగా సినిమాలు చేసే కండల వీరుడు ప్రస్తుతం ఒక డిఫరెంట్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. అయితే ఇందులో ఒక ముఖ్యమైన పాత్ర కోసం సల్మాన్ తన బావ కోసం ఒక ఇంపార్టెంట్ రోల్ ను ఆఫర్ చేశాడు.
salman khan
ఆయుష్ శర్మ, సల్మాన్ సోదరిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. దత్తత సోదరి అయినప్పటికీ సల్మాన్ కు చెల్లి అంటే పంచ ప్రాణాలు. ఇక బావగారు ఆయుష్ శర్మను కూడా ఎంతగానో గౌరవాన్ని ఇచ్చే సల్మాన్ సరైన హిట్ మాత్రం ఇవ్వలేకపోతున్నాడు. ఆయుష్ చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా వర్కౌట్ కావడం లేదు. ఇక ఇప్పుడు ఎలాగైనా బావగారికి మంచి బ్రేక్ ఇచ్చి కళ్ళల్లో ఆనందం చూడాలని సల్మాన్ తన సినిమాతోనే లేపే ప్రయత్నం చేస్తున్నాడు.
ayush
‘యాంటీమ్’ అనే సినిమా చేస్తున్న సల్మాన్ ఖాన్ అందులో బావకు పవర్ఫుల్ రోల్ ఇచ్చినట్లు ఇటీవల ఒక టీజర్ తో అర్ధమయ్యింది. చూస్తుంటే అందులో ఈ హీరో సల్మాన్ కు సమానమైన పాత్ర చేస్తున్నాడా లేక విలన్ గా చేస్తున్నాడా అనే అనుమానం వస్తోంది. అయితే అతను ఇప్పటివరకు నటుడిగా కూడా మంచి క్రేజ్ అందుకోలేదు. ఒక విధంగా సల్మాన్ డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. మరి సల్మాన్ ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. మహేష్ మంజ్రేకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సల్మాన్ సొంత ప్రొడక్షన్ లో నిర్మిస్తున్నారు.