fbpx
Home Movie Reviews యోగీ ఆదిత్య నాథ్ బయోపిక్, హీరో – యాంటీ హీరో! 

యోగీ ఆదిత్య నాథ్ బయోపిక్, హీరో – యాంటీ హీరో! 


ప్రధాని నరేంద్ర మోడీ బయోపిక్ విడుదలని ఎన్నికల సంఘం ఆపేసిన విషయం తెలిసిందే. దీనికంటే ముందు  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యా నాథ్ బయోపిక్ గా బరితెగించి  తీసిన ‘జిల్లా గోరఖ్ పూర్’ పోలీసు కేసు నమోదు కావడంతో విడుదల ఆగిపోయింది.

ఇందులో సీఎం యోగీని పిస్టల్ పట్టుకున్న నేతగా యాంటీ హీరోగా చూపిస్తూ పోస్టర్లు విడుదల చేశారు. ఇదిలా వుండగా తాజాగా ఇంకో యోగీ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీని పేరు నకాష్ (శిల్పి). దర్శకుడు జైఘం ఇమాం. యోగీని ప్రియతమ నేతగా చూపిస్తూ శ్లాఘించాడు. సెన్సారు వారు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చేశారు. నిజానికి ఏడాది క్రితమే నిర్మాణం పూర్తయిన దీన్ని ఇంకాలస్యం చేయకుండా విడుదల చేయవచ్చు.

కానీ ప్రధాని బయోపిక్ నే ఈసీ అపేశాక యోగీ వెండితెర కావ్యాన్ని ఈసీ అనుమతిస్తుందన్న ఆశలేం పెట్టుకోవడం లేదు నిర్మాతలు. అందుకని వచ్చేనెల విడుదల చేస్తున్నారు. 

‘నకాష్’ నిజానికి యోగీ ఆదిత్యానాథ్ బయోపిక్ కాదు. ఇందులో ఒక ముఖ్య  పాత్రగా మాత్రమే ఆయన కన్పిస్తాడు. అదెలా అన్నది దర్శకుడు చెప్పడం లేదు. కానీ దీని కథ మాత్రం బయటి కొచ్చేసింది. గత సంవత్సరం సింగపూర్ దక్షిణాసియా చలన చిత్రోత్సవాల్లో అవార్డు  గెలుచుకున్న సందర్భంగా కథ తెలిసిపోయింది.

దర్శకుడి జైఘం ఇమాంకి ‘ఎమర్జింగ్ ఫిలిం మేకర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుతో సత్కరించింది కూడా జ్యూరీ. ‘నకాష్’ కథ సెక్యులర్ ఇండియా కథ. మరి సెక్యులర్ ఇండియా కథలో యోగీకి పనేమిటి? యోగీని ఇందులో ఎలా చూపించినా సంఘ్ పరివార్ మాత్రం అల్లరి చేయకుండా ప్రశాంతంగా వుంది.  

కథ వచ్చేసి,  వారాణసిలో ఒక ముసలీం శిల్పి అల్లా రఖా. ఇతను ఆలయాల్లో హిందూ విగ్రహాలని చెక్కుతూంటే ముస్లిం సమాజం వెలి వేస్తుంది. మదరసాలో అతడి పిల్లలకి ప్రవేశం దొరకదు. హిందూ సమాజం కూడా కన్నెర్ర జేస్తుంది. పోలీసులు పట్టుకుని కొడతారు. అల్లారఖా రక్షణలో ఆలయ ట్రస్టుకి చెందిన బంగారం వుంటుంది. దాన్ని అతడి స్నేహితుడు సమద్  దొంగిలిస్తాడు. ఏడాది గడుస్తుంది. అల్లా రఖాని  మతసామరస్యానికి  ప్రతీకగా కీర్తిస్తుంది మీడియా. దీంతో మున్నా అనే హిందూ నేత ఎన్నికల్లో ఓడిపోతాడు. వారణాసిలో ఇరుమతాల వారికీ హీరో అయిపోయిన అల్లా రఖా మీద మున్నాతో బాటు సమద్  కక్ష గడతారు. ఈ నేపధ్యంలో ఏం జరిగిందన్నది మిగతా కథ.

ఇందులో సీఎంయోగీగా కుముద్ మిశ్రా నటించాడు. ఈ పాత్రని యోగీతో ఏంతో స్ఫూర్తి పొంది రూపొందించినట్టు  దర్శకుడు వివరించాడు. ప్రేక్షకులు ఈ పాత్రని బాగా  ఎంజాయ్ చేస్తారని కూడా అన్నాడు. సింగపూర్  చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించాక కేన్స్ చిత్రోత్సవాలాకి కూడా వెళ్ళింది ‘నకాష్’. ఇందుకు గాను కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా ఎంపిక చేసి పంపింది. నకాష్ నిర్మాతలుగా గోవింద్ గోయాల్, పవన్ కుమార్ మిశ్రా, ఆశుతోష్ శర్మ, శ్వేతా తివారీ లున్నారు. సరే, ఇదంతా యోగీ హీరోయిజం గురించి. మరి యాంటీ హీరోయిజం గురించి? 

‘జిల్లా గోరఖ్ క్ పూర్’ గత సంవత్సరం ఆగస్టులో పోలీసు కేసు నమోదై విడుదల ఆగిపోయింది. బిజెపి నేతలే కేసు వేసి దీన్ని అడ్డుకున్నారు. యోగీ ఆదిత్యానాథ్ కాస్ట్యూమ్స్ లో వున్న పాత్ర చేతులు వెనుక కట్టుకుని నిలబడితే, ఆ చేతుల్లో పిస్తోలు వుండడం, ఎదురుగా  ఆలయాలూ గోవులూ వుండడం పోస్టర్ల మీద చూసి దుమారం లేపారు బిజెపి నేతలు.

నిర్మాత వినోద్ తివారీ మీద కేసు వేసి సినిమాని అడ్డుకున్నారు. నిర్మాత తివారీ స్పందిస్తూ,  పోస్టర్లు చూసి అపార్థం చేసుకున్నారనీ, అయినప్పటికీ సమాజంలో శాంతి సామరస్యతల దృష్ట్యా ‘జిల్లా గోరఖ్ పూర్’  ని బుట్ట దాఖలు చేస్తున్నట్టు ప్రకటించాడు.

సికిందర్

తెలుగురాజ్యం ప్రత్యేకం

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకెళ్ళారు ? వేగంగా మారిపోతున్న పరిణామాలు

చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. రోజువారీ షెడ్యూల్ మొత్తాన్ని రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళటంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. చివరి దశ పోలింగ్ దగ్గర పడటంతో పాటు ఢిల్లీ  రాజకీయం కూడా...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

ప్రభాస్ ఇస్తానంటున్న సర్పైజ్ ఇదే? (వీడియో)

మే 21న ‘సాహో’ సర్‌ప్రైజ్‌ ఉందంటూ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసారు. అంతేకాదు ఆ సర్ ప్రైజ్ ని తన సోషల్‌మీడియా ఎక్కౌంట్ లో దాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి...

ఐశ్వర్య ట్వీట్ దుమారం, క్షమాపణ చెప్పనంటూ హీరో

నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపుతోంది. ఈ ట్వీట్ ను డిలీట్‌ చేయాలని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర...

అడ్రస్ లేని పవన్…ఎగ్జిట్ పోల్స్ పై నోరెత్తటం లేదే ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం మొదటి నుండి కొంచెం తేడాగానే ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినపుడు వెంటనే అందరూ మాట్లాడినా పవన్ మాత్రం ఎక్కడా కనిపించరు. అందరూ ఆ సమస్యను మరచిపోతున్న...

‘మహర్షి’:తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల కలెక్షన్స్ !

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. రిలీజ్ పది రోజులు...

సంస్ధేదైనా అధికారం మాత్రం వైసిపిదే

ఎగ్జిగ్ పోల్ నిర్వహించిన సంస్ధల ఫలితాలతో హోరెత్తిపోతోంది. జాతీయ రాజకీయాలను పక్కనపెడితే రాష్ట్రం వరకూ వైసిపిదే అధికారం అని తేలిపోయింది. ఒక్క లగడపాటి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో తప్ప ఇక ఏ...

సిస్టర్ సెంటిమెంట్ నమ్ముకుంటున్న బన్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ రూపొందనున్న సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎప్పటిలాగే ఫన్ తో పాటు ఈ సారి...

‘ఏబీసీడీ’కలెక్షన్స్ మరీ అంత దారుణమా?

అల్లు శిరీష్‌ హీరోగా వచ్చిన ‘ఏబీసీడీ’ చిత్రం అంచనాలను అందుకోలేక చతికిలపడిన సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఏబీసీడీ చిత్రంను తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్‌ చేసారు కానీ కలిసి...

పదేళ్ళుగా ఈవిఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారట !

చంద్రబాబునాయుడు మాటలు విచిత్రంగానే ఉంటాయి. తాను చెప్పదలుచుకున్నదే చెబుతారు. అంతేకానీ అడిగినదానికి మాత్రం సమాధానం చెప్పరు. అలాగే చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన కూడా ఉండదు. తాజాగా ఢిల్లీలో ఎన్నికల...

బెట్టింగ్ రాయళ్ళు నిండా ముణగటం ఖాయమేనా ?

చిలక జోతిష్కుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలను నమ్ముకుంటే తెలుగుదేశంపార్టీ నేతలు మళ్ళీ నిండా ముణగటం ఖాయమేనా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో మెజారిటీ జాతీయ మీడియా సంస్ధలు...

‘సాహో’ఫైట్‌ లో కారు ఎలా నుజ్జైందో చూడండి! (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన బాహుబలి తరువాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్‌ రావటంతో సాహోను కూడా...
 Nate Gerry Jersey