fbpx
Home National జయప్రద ఒక అనార్కలి, ఈ సారి నోరు జారింది ఆజంఖాన్ కొడుకు

జయప్రద ఒక అనార్కలి, ఈ సారి నోరు జారింది ఆజంఖాన్ కొడుకు

హీరోయిన్ జయప్రద మూడో సారి లోక్ సభ లో ప్రవేశించేందుకు ఈ సారి చాలా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటున్నారు. ఈ ప్రయత్నం కూడా ఉత్తరప్రదేశ్ నుంచే చేస్తున్నారు. ఈ సారి బిజెపి అభ్యర్థిగా ఉత్తరప్రదేశ్ రామ్ పూర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. ఇది ఆమెకు నాలుగో ఎన్నిక. మొదటి రెండు సార్లు నెగ్గారు. మూడో సారి వోడిపోయారు. ఇపుడు మళ్లీ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఆమె విజయానికి రాజకీయ గురు అమర్ సింగ్ తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ సారి రామ్ పూర్ లో ఒకప్పటి మిత్రుడు, అతర్వాత బద్ధశత్రువుగా మారిన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి ఆజాంఖాన్ ఆమె ప్రత్యర్థి.ఆజాంఖాన్ సొంతవూరు రామ్ పూరే.

జయప్రద ఈ సారి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయడంతో అక్కడ ఎస్ పి అభ్యర్థి ఆజం ఖాన్ కొద్దిగా తత్తరపాటుకుగురవుతున్నట్లు ఉంది. ఆమె మీద అభ్యంతరకరమయిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇపుడు దీనికి ఆజంఖాన్ కొడుకు కూడా తోడయ్యాడు. ఆయన కుమారుడు అబ్దుల్లా ఆజం ఖాన్‌ జయప్రదను అనార్కలిగా వర్ణించాడు. తాము అలిని, భజరంగ్‌ భళిని కోరుకుంటామని అనార్కలిని కాదని ఆయన వ్యాఖ్యానించి జయప్రదకు బాగా ఆగ్రహం తెప్పించారు.

తండ్రి నోరు జారి కొని తెచ్చుకున్న వివాదం ఇంకా సద్దుమణగ లేదు, కొడుకిపుడు మరొకరాయి వేశాడు.

“Ali bhi humare, Bajrang Bali bhi chahiye lekin anarkali nahi chahiye (We want Ali and also Bajrang Bali but not Anarkali).” అని రాంపూర్ లో ఒక సభలో మాట్లాడతూ అబ్దుల్లా ఖాన్ అనడం ఇపుడు వివాదం రేపు తూ ఉంది. తండ్రి లాగే ఆయన కూడా జయప్రదే పేరెత్తకుండా మాట్లాడినా, అది ఎవరినుద్దేశించి అన్నారో స్పష్టమవుతూనే ఉంది.

అనార్కలి అక్బర్ ఆస్థాన నర్తకి. ఆమెకు అక్బర్ చక్రవర్తి కొడుకు ఆమెను ప్రేమించాడు. ఇది జగమెరిగిన కథే.

నిజానికి తండ్రి ఆజంఖాన్ కూడా గతంలో ఇలాంటి వ్యాఖ్యా చేసి పార్టీ నుంచి బహిష్కృతుడయ్యాడు. అపుడ జయప్రద, ఆజంఖాన్ఇద్దరు ఎస్ పిలో నే ఉన్నారు. ఎందుకో సంబంధాలు చెడిపోయాయి. తిట్టుకోవడం మొదలుపెట్టారు.

ఒకరినొకరు విమర్శించుకుంటూ బజారెక్కారు. అజాంఖాన్ అట్లాంటోడు ఇట్లాంటోడుకాదు ఏకంగా ‘అల్లావుద్దీన్ ఖిల్జీ అని జయప్రద రెచ్చిపోతే, ఆమె ఒక ‘నాచ్నే వాలీ’ అంటే డ్యాన్సర్ అని ఆజామ్ ఖాన్ అన్నారు. జయప్రద ను అంతమాట అంటావా అని ఆజామ్ ఖాన్ మీద అపుడు బాగా పీక్ లో ఉన్న అమర్ సింగ్ ఆగ్రహించారు.

2009 ఎన్నికల్లో ఆమెకు సీటురాకుండా చేయాలని ఆజాంఖాన్ ప్రయత్నించారు. అయితే, ఆమె వెనక ఉన్న శక్తి అమర్ సింగ్, అమర్ సింగ్ వెనక ఉండేది ములాయాం సింగ్ యాదవ్ కాబట్టి రెండో సారి రామ్ పూర్ నుంచి నిలబడే అవకాశం దొరిగింది. అపుడు అజాంఖాన్ ప్రచారం చేయకపోయకపోగా, పరోక్షంగా నూర్ బానో కు సహాయం కూడా చేశారని చెబుతారు. అయినా సరే రెండో సారి కూడా జయప్రద అక్కడి నుంచి గెలిచారు.

అమర్ సింగ్ జోరుగా ఉన్నాడు కాబట్టి అజాంఖాన్ ను పార్టీనుంచి కూడా పంపించాడు. జయప్రదను నాచ్నేవాలీ అన్నందుకు పార్టీ నుంచి బహిష్కరింపచేసి ఆయన ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడని చెబుతారు.

రామ్ పూర్ ఎన్నిక గురించి మాట్లాడే టపుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. రామ్ పూర్ లో గెలుపొందిన రెండు ఎన్నికల్లో ఆమెకు సమాజ్ వాది పార్టీ ముస్లిం ఇమేజ్ బాగా పనిచేసింది. ఇపుడామె ముస్లిం వ్యతిరేక పార్టీ బిజెపి లో ఉన్నారు. దానికి తోడు ఉత్తర ప్రదేశ్ లో ఏకైక ముస్లిం మెజారిటీ జిల్లా రామ్ పూరే. ఈ ఎన్నిక ఆమె రామ్ పూర్ ప్రజల్లో జయప్రద సంపాదించుకున్న ప్రేమాభిమానాలకు పరీక్ష.రాజకీయాల్లో అన్నిరోజులు ఒక లాగే ఉండవు. పరిస్థితులు తిరగబడుతుంటాయి. 2010లో అమర్ సింగ్ ను, జయప్రదను సమాజ్ వాది పార్టీ నుంచి తరిమేశారు. అపుడు జయప్రద అమర్ సింగ్ తోపాటు అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ లో చేరారు. ఆమె 2014లో బిజ్నోర్ నుంచి లోక్ సభకు పోటీ చేశారు. అక్కడ డిపాజిట్ కూడా దక్కలేదు. నాలుగో స్థానంలో కేవలం 24 వేల వోట్లొచ్చాయి.

ఇపుడు జయప్రద ఏకంగా హిందూవోట్ల మద్దతుతో తన మీద పోటీచేయడంతో ఆజం ఖాన్ జడిసిపోతున్నట్లున్నారు. దానితో మీద అసభ్యకరమయిన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక పదిరోజుల కిందట
జయప్రద వేసుకున్న అండర్ వేర్ ఖాకిరంగుదని అన్నారు. ‘ఇక్కడి ప్రజలకు ఆమెగురించితెలిసేందుకు 17 సంవత్సరాలు పట్టింది. నాకయితే 17 రోజుల్లో తెలిసిపోయింది, ఆమె వేసుకున్న అండర్ వేర్ ఖాకి రంగుది,’ అని అన్నాడు.

దీనితో పెద్ద దూమారం లేచింది. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు వెళ్లింది. ఇది అసభ్యకరమయిన వ్యాఖ్య అని తేల్చి కమిషన్ ఖాన్ ని 72 గంటల పాటు ప్రచారం నుంచి నిషేధిచింది. ఆయన తిరిగి ప్రచారంలోకి వచ్చాడో ఈ సారి కొడుకు అబ్దుల్లా ఖాన్ నోరు పారేసుకున్నాడు. ఆమెను అనార్కలి అన్నాడు.
దీనికి జయప్రద కు కోపం వచ్చింది. చదువుకున్నోడు కాబట్టి అబ్దుల్లా ఖాన్ మంచిగా ప్రవర్తిస్తాడునుకున్నా. అయితే, అతను తన తండ్రికొడుకే అని నిరూపించుకున్నా, అదే కుటుంబం కదా,మహిళలను ఎలా గౌరవించాలా వాళ్లకి తెలియదు, అని జయప్రద వ్యాఖ్యానించారు.

తెలుగురాజ్యం ప్రత్యేకం

బాబు గారి ‘Is It not వివక్షత’ కి ఈసీ కౌంటర్?

చంద్ర బాబు గారు ఎలక్షన్ కమిషన్ ని కలిసిన తర్వాత మాట్లాడుతూ పోలింగ్ జరిగిన 30 రోజుల తర్వాత ఎలా రీపోలింగ్ నిర్వహిస్తారని , is this not వివక్షత అంటూ ప్రశ్నించారు....

‘ఎబిసిడి’ రివ్యూ – చిన్న మహర్షి అవుదామనుకుంటే…

ఐదు సినిమాల అల్లుశిరీష్ యువహీరోగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్ చేస్తున్నాడు. ఆరో సినిమాగా నాలుగక్షరాల ‘ఎబిసిడి’ కొచ్చాడు. రీమేక్ తో, కొత్త దర్శకుడితో ఒక ప్రయోగం చేస్తున్నట్టు చెప్పాడు. అట్టహాసంగా 600 పై చిలుకు...

చంద్రబాబు ఢిల్లీకి ఎందుకెళ్ళారు ? వేగంగా మారిపోతున్న పరిణామాలు

చంద్రబాబునాయుడు హఠాత్తుగా ఢిల్లీకి వెళ్ళారు. రోజువారీ షెడ్యూల్ మొత్తాన్ని రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి వెళ్ళటంతో అనేక అనుమానాలు మొదలయ్యాయి. చివరి దశ పోలింగ్ దగ్గర పడటంతో పాటు ఢిల్లీ  రాజకీయం కూడా...

అత్యంత ప్రజాధారణ

తాజా వార్తలు

ప్రభాస్ ఇస్తానంటున్న సర్పైజ్ ఇదే? (వీడియో)

మే 21న ‘సాహో’ సర్‌ప్రైజ్‌ ఉందంటూ ప్రభాస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్‌ చేసారు. అంతేకాదు ఆ సర్ ప్రైజ్ ని తన సోషల్‌మీడియా ఎక్కౌంట్ లో దాన్ని విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. దీనికి...

ఐశ్వర్య ట్వీట్ దుమారం, క్షమాపణ చెప్పనంటూ హీరో

నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ నటి ఐశ్వర్య రాయ్‌ను ఎగ్జిట్‌ పోల్స్‌తో పోల్చుతూ చేసిన ట్వీట్‌ ఇప్పుడు పెద్ద దుమారాన్నే లేపుతోంది. ఈ ట్వీట్ ను డిలీట్‌ చేయాలని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మధుర...

అడ్రస్ లేని పవన్…ఎగ్జిట్ పోల్స్ పై నోరెత్తటం లేదే ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యవహారం మొదటి నుండి కొంచెం తేడాగానే ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినపుడు వెంటనే అందరూ మాట్లాడినా పవన్ మాత్రం ఎక్కడా కనిపించరు. అందరూ ఆ సమస్యను మరచిపోతున్న...

‘మహర్షి’:తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల కలెక్షన్స్ !

భారీ అంచనాల మధ్య వచ్చిన ‘మహర్షి’ సినిమా మంచి టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. రెండు వారాల క్రితం విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద విజయవంతంగా రాణిస్తోంది. రిలీజ్ పది రోజులు...

సంస్ధేదైనా అధికారం మాత్రం వైసిపిదే

ఎగ్జిగ్ పోల్ నిర్వహించిన సంస్ధల ఫలితాలతో హోరెత్తిపోతోంది. జాతీయ రాజకీయాలను పక్కనపెడితే రాష్ట్రం వరకూ వైసిపిదే అధికారం అని తేలిపోయింది. ఒక్క లగడపాటి నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో తప్ప ఇక ఏ...

సిస్టర్ సెంటిమెంట్ నమ్ముకుంటున్న బన్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ రూపొందనున్న సినిమా కథకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఎప్పటిలాగే ఫన్ తో పాటు ఈ సారి...

‘ఏబీసీడీ’కలెక్షన్స్ మరీ అంత దారుణమా?

అల్లు శిరీష్‌ హీరోగా వచ్చిన ‘ఏబీసీడీ’ చిత్రం అంచనాలను అందుకోలేక చతికిలపడిన సంగతి తెలిసిందే. మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన ఏబీసీడీ చిత్రంను తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్‌ చేసారు కానీ కలిసి...

పదేళ్ళుగా ఈవిఎంలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారట !

చంద్రబాబునాయుడు మాటలు విచిత్రంగానే ఉంటాయి. తాను చెప్పదలుచుకున్నదే చెబుతారు. అంతేకానీ అడిగినదానికి మాత్రం సమాధానం చెప్పరు. అలాగే చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన కూడా ఉండదు. తాజాగా ఢిల్లీలో ఎన్నికల...

బెట్టింగ్ రాయళ్ళు నిండా ముణగటం ఖాయమేనా ?

చిలక జోతిష్కుడు లగడపాటి రాజగోపాల్ సర్వేలను నమ్ముకుంటే తెలుగుదేశంపార్టీ నేతలు మళ్ళీ నిండా ముణగటం ఖాయమేనా ? వ్యవహారం చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. తెలంగాణా ముందస్తు ఎన్నికల్లో మెజారిటీ జాతీయ మీడియా సంస్ధలు...

‘సాహో’ఫైట్‌ లో కారు ఎలా నుజ్జైందో చూడండి! (వీడియో)

ప్రపంచ వ్యాప్తంగా ఘన విజయం సాధించిన బాహుబలి తరువాత యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సాహో. బాహుబలితో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో స్టార్ ఇమేజ్‌ రావటంతో సాహోను కూడా...
 Nate Gerry Jersey