Home Entertainment Tollywood అన్న‌పూర్ణ‌లో ప్ర‌భాస్ చిత్రం...!

అన్న‌పూర్ణ‌లో ప్ర‌భాస్ చిత్రం…!

‘బాహుబలి’ తర్వాత చాలా కాలం గ్యాప్‌ తీసుకున్న ప్రభాస్‌ ఆ తర్వాత ‘సాహోస‌తో ప్రేక్ష‌కుల ముందుకు వచ్చాడు. ఇక ఆ చిత్రం టాక్ ప‌ర్వాలేద‌నిపించుకున్నా.. బాక్సాఫీస్ ముందు మాత్రం మంచి క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది. ప్ర‌స్తుతం ఇప్పుడు మరో చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. ఈ చిత్రం గురించి ఇటీవలే కృష్ణంరాజు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… ప్రభాస్‌కు త్వరలో షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడని వెల్లడించాడు. తాజా సమాచారం మేరకు సంక్రాంతి కనువ తెల్లారిరోజు అనగా శుక్రవారంనాడు ప్రభాస్‌ షూటింగ్‌లో పాల్గొన్నాడు. ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ప్రేత్యేక సెట్‌ను వెయ్యడం జరిగింది. అందులో ఓ గీతాన్ని చిత్రీకరించనున్నారు. ఈ విషయాన్ని శుక్రవారంనాడు చిత్ర యూనిట్‌ వెల్లడించింది. కృష్ణంరాజు స్వంత నిర్మాణ సంస్థ గోపికృష్ణ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

ఎప్పటినుంచో ప్రభాస్‌తో సినిమా చేయాలనే ఆశయం ఈ ఏడాది కృష్ణంరాజుకు తీరింది. ఇందులో కృష్ణంరాజు కూడా ఓ ప్రత్యేక పాత్రలో కన్పించబోతున్నారు. భారీ బడ్జెట్‌ ప్యాన్‌ ఇండియన్‌ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ్‌ భాషల్లో రూపొందనుంది. గోపికృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ సంస్థతో అనుబంధంగా చిత్రీకరణ జరుపుకోనున్న ఈ మూవీని స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘జిల్‌’ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు రాధాకృష్ణ ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తున్నాడు. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : మనోజ్‌ పరమహంస, ఎడిటర్‌ :శ్రీకర్‌ ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌ : రవీందర్‌ సమర్పణ: కృష్ణంరాజు, నిర్మాతలు: ప్రమోద్‌, వంశీ, దర్శకుడు : కే కే రాధాకృష్ణ కుమార్‌.

మ‌రి ఈ చిత్రాన్ని ప్ర‌భాస్ ఏ విధంగా తెర‌కెక్కిస్తారు. ఆయ‌న పాత్ర ఎలా ఉండ‌బోతుంది అన్న విష‌యాలు తెలియాల్సి ఉంది. అలాగే ఈ మ‌ధ్య కాలంలో పూజా హగ్డే మంచి ఊపు మీద ఉంద‌ని చెప్పాలి. ఇటీవ‌లే పూజా న‌టించిన అల‌వైకుంఠ‌పురంలో చిత్రం మంచి హిట్ టాక్ ను తెచ్చుకుంది. అంత‌కు ముందు న‌టించిన మ‌హ‌ర్షి చిత్రం కూడా హిట్ టాక్‌ను సంపాదించుకుంది.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

ఆ న‌టితో ఎఫైర్ నిజ‌మే.. ఒప్పుకున్నజ‌గ్గూభాయ్!

జ‌గ్గూభాయ్ ఉరాఫ్ జ‌గ‌ప‌తిబాబు తాజాగా ఓ క్రేజీ హీరోయిన్‌తో త‌న‌కున్న ఎఫైర్‌ని బ‌య‌ట‌పెట్ట‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొన్నేళ్ల క్రితం జ‌గ‌ప‌తిబాబు అప్ప‌ట్లో బెంగ‌ళూరుకు చెందిన స్టార్ హీరోయిన్‌తో అత్యంత స‌న్నిహితంగా మెలిగిన...

మండే ఎండ‌లో క‌రోనా మంట‌ల్లా!

ఓవైపు క‌రోనా క‌ల్లోలం.. మ‌రోవైపు స‌మ్మ‌ర్ ఎటాక్. న‌డిమ‌ధ్య‌లో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోతున్నారు. క‌రోనా కోర‌లు చాచి విజృంభిస్తుంటే..భానుడు ప్ర‌తాపాన్ని చూపిస్తున్నాడు. భార‌త్ లో న‌మోద‌వుతున్న ఉష్ణోగ్ర‌త‌ల‌కి క‌రోనా కాస్త కంట్రోల్ లోనే ఉంటుంది....

`ఆహా` కోసం సీన్‌లోకి ట్ర‌బుల్ షూటర్!

అల్లు అర‌వింద్ ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్రారంభించిన ఓటీటీ `ఆహా`. భారీ రేంజ్‌లో ప్లాన్‌లు వేసి ఈ ఓటీటీని తెర‌పైకి తీసుకొచ్చారు. లాంచింగ్ కి ఏడాది నుంచే ప్లాన్‌లు గీసినా అది ప్రాక్టిక‌ల్‌గా మాత్రం అస్స‌లు...

ప్చ్‌.. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ కెరీర్ డైల‌మాలో!

ఆర్.ఎక్స్ -100 ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి కెరీర్ డైల‌మా ఇప్ప‌ట్లో క్లియ‌ర‌వ్వ‌దా? మ‌హాస‌ముద్రం ప్రాజెక్ట్ ఏడాది కాలంగా చ‌ర్చ‌ల‌ ద‌శ‌లోనే న‌లుగుతున్న సంగ‌తి తెలిసిందే. తొలుత ఈ ప్రాజెక్ట్ నాగ‌చైత‌న్య ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం...

#క‌రోనా: స‌్టార్ హీరోల‌తో నిర్మాత‌ల అత్య‌వ‌స‌ర భేటీ?

లాక్ డౌన్ నేప‌థ్యంలో షూటింగ్‌లేవీ అనుకున్న స‌మ‌యంలో పూర్తికాలేదు. షూటింగులు సహా రిలీజ్ ల‌ షెడ్యూల్స్ త‌ల‌కిందులైపోయాయి. అయితే దీనివ‌ల్ల అంద‌రి కంటే ఎక్కువ‌గా న‌ష్ట‌పోయేది నిర్మాత‌లే. ఒక రోజు షూటింగ్ నిలిచిపోయిందంటేనే...

క‌రోనా: సాయంలో ఆ న‌లుగురు డ‌మ్మీయేనా?

తెలుగు ప్ర‌జ‌లు విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న‌ప్పుడు ప్ర‌తిసారీ టాలీవుడ్ స్పందించే తీరు ప్ర‌శంస‌లు అందుకుంటూనే ఉంది. ఒక ర‌కంగా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో విప‌త్తులు వ‌చ్చినా మ‌న స్టార్లు ఉదారంగా విరాళాలు అందిస్తూ...

లాక్ డౌన్ ఉల్లంఘించి పిల్ల‌ర్ ని గుద్దిన హీరోయిన్

దాదాపు దేశం మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వ‌ర‌కూ గుమ్మం దాట‌డానికి వీల్లేని స్థితి. ముఖ్యంగా మెట్రో పాలిట‌న్ సిటీల్లో లాక్ డౌన్ ప‌క్కాగా అమ‌ల‌వుతోంది. అయినా కొన్ని చోట్ల...

పృథ్వీరాజ్ ఫేస్ బుక్ పోస్ట్ వైర‌ల్‌!

క‌రోనా ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న వేళ మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ జోర్డాన్‌లో చిక్కుకున్న విష‌యం తెలిసిందే. `ఆడుజీవితం` సినిమా షూటింగ్ కోసం 58 మంది యూనిట్ స‌భ్యుల‌తో జోర్డాన్ వెళ్లిన ఈ చిత్ర...

షాకింగ్ ట్విస్ట్‌: స్వ‌లింగ సంప‌ర్కుడితో హీరోయిన్ ఎఫైర్

ఒక‌రిని ప్రేమించి.. కొన్నాళ్ల పాటు స‌హ‌జీవ‌నం చేసి.. అటుపై క‌ల‌త‌ల‌తో విడిపోతే.. అప్పుడు అత‌డిని హిజ్రా అంటూ అవ‌మానించ‌డం స‌రైన‌దేనా? అత‌డు హిజ్రా అయితే అది ముందే తెలుసు క‌దా? ఇంత‌కాలం ఎందుక‌ని...

ఆవిడ‌ అక్క అయితే.. ప్ర‌భాస్ బావ గారు!

డార్లింగ్ ప్ర‌భాస్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. అమెరికాలోనూ అత‌డికి వీరాభిమానులున్నారు. ఇక‌పోతే మిర్చి ఫేం రిచా గంగ‌పోధ్యాయ ప్ర‌స్తుతం అమెరికాలోనే ఉంటోంది. మిర్చి..మిర‌ప‌కాయ్..భాయ్ లాంటి సినిమాల్లో న‌టించిన...