ఏపీకి ‘అప్పు రేపు’ అంట ! చేతులు పిసుక్కుంటున్న జగన్ ప్రభుత్వం !

The YCP government has brought the state to the brink of bankruptcy

ఆంధ్రప్రదేశ్: సంక్షేమ పథకాల అమలుతో రాష్ట్ర ప్రజల మనసులో ఇరుక్కోవాలని జగన్ పడుతున్న తాపత్రయంతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని ఆర్ధిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. రాష్ట్ర ఖజానా మొత్తం పథకాల కోసం ఖర్చు చేశారు. ఉన్నదంతా ఊడ్చేసి చాలక అప్పులు కూడా చేస్తూ రాష్ట్రాన్ని దివాళా దారివైపు నడిపిస్తున్నారని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయానికి పెద్ద గండి పడింది. ఇలాంటి సమయంలో ఉన్న బొక్కని పూడ్చకుండా మరింత పెద్దది చేసుకుంటూపోతున్నారు.

The YCP government has brought the state to the brink of bankruptcy

ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులకు నెల జీతాలు ఇవ్వలేక ఇబ్బంది పడుతున్నప్పటికీ కేంద్రం, బ్యాంకులు వద్ద అప్పులు చేసి మరీ ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేపు రాష్ట్రం, ప్రజల పరిస్థితి ఏమవుతుందో అనే ఆలోచన అసలు ప్రభుత్వం చేస్తుందా అనే అనుమానం కలుగుతుంది. ఈ నెల ఎలాగోలా కొత్త అప్పు చేస్తే వచ్చింది పాత అప్పు తీర్చటానికి కూడా చాలలేదు. ఇంకా కొంత మంది ప్రభుత్వ ఉద్యోగులకు గత నెల శాలరీ అందలేదు. శాలరీ ఎప్పుడొస్తుందో అని, అసలు వస్తుందా రాదా అని లబోదిబోమంటున్నారు.

ఇటు చూస్తే మరో వారంలో ఆగష్టు నెల వచ్చేస్తుంది. కొత్త అప్పుల కోసం ఆర్ధిక మంత్రి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎక్కడికెళ్లినా ‘అప్పు రేపు’ అనే బోర్డు చూపెడుతున్నారట. ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో ఆర్ధికమంత్రి బుగ్గన చేతులు పిసుక్కుంటున్నారట. జగన్ ప్రభుత్వానికి వచ్చే నెల తిప్పలు తప్పేలా లేవు. మితిమీరిన సంక్షేమం రాష్ట్రానికి చేటుగా మారుతుంది. వెనిజులా దేశంలా ఏపీ అవుతుందా అనే అనుమానం కలుగుతుంది. ఈ గండం నుండి రాష్ట్రాన్ని జగన్ ప్రభుత్వం కాపాడుతుందా? (ఫ్యాన్) గాలికి వదిలేస్తుందా ? దేవుడికి మాత్రమే తెలుసు వీటికి సమాధానం !.