Model school jobs in AP: ఆంధ్రప్రదేశ్ లోని మోడల్ స్కూల్స్ లో ఉన్న 282 ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. కానీ వాటిని కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని అనుకుంటున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా అధికారికంగా తెలపింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ భర్తీతో మోడల్ స్కూళ్లలో ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు సబ్జెక్టు టీచర్ల కొరత తీరబోతుంది. మొత్తం 282 పోస్టుల్లో 211 (PGT), 71 (TGT) పోస్టులున్నాయి. అలాగే యూపీఎస్సీ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీచేశారు. నోటిఫికేషన్ లో భాగంగా ఖాళీగా ఉన్న 187 పోస్టులను అర్జెంట్ గా భర్తీ చేయాలని నిర్ణయించారు. కాగా అసిస్టెంట్ కమిషన్ 02, అసిస్టెంట్ ఇంజనీర్ 157, జూనియర్ టైం స్కేల్ ఆఫీసర్ 17, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ 09, అసిస్టెంట్ ప్రొఫెసర్- 02 పోస్టులున్నాయి. ఇక దరఖాస్తులకు చివరి తేది 2022 జనవరి 13.
మరి అభ్యర్థులు పూర్తి వివరాలకు ఈ క్రింద వెబ్సైట్ చూడొచ్చు.