మొత్తానికి కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలను కుటుంబమే పూర్తి చేసింది. అధికార లాంచనాలతో కోడెల అంత్యక్రియలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినా పార్టీ, కుటుంబం తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ విషయం మీదనే ఇటు జిల్లా యంత్రాంగానికి అటు పార్టీ నేతలు, కుటుంబ సభ్యులకు మధ్య చాలాసేపు వివాదం నడిచింది.
ప్రభుత్వ లాంచనాల విషయంలో కుటుంబాన్ని ఒప్పించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫెయిలయ్యాయి. దాంతో చివరి విషయంలో కూడా గొడవ ఎందుకులే అని అధికారులు వెనక్కు తగ్గారు. మొత్తానికి అంత్యక్రియలకు అవసరమైన ఏర్పాట్లను పార్టీ నేతలు, కుటుంబ సభ్యులే దగ్గరుండి చూసుకున్నారు.