పవన్‌కళ్యాణ్ జనసేనపార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర స్థాయిలో ఇరు వర్గాలు కలిసి పని చేయాలని రెండు పార్టీలు కలిసి నిర్ణయించుకున్నాయి. ఇక ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ విజయవాడలో జరిగిన సంయుక్త సమావేశం అనంతరం వెల్లడించారు. బీజేపీతో ఉన్న అంతరాలన్నీ తొలగిపోయాయనీ, చిన్న చిన్న అనుమానాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా మాట్లాడుకున్నామని రాష్ట్ర ప్రయోజనాల్నీఅలాగే దేశ ప్రయోజనాల్నీ దృష్టిలో పెట్టుకుని బీజేపీతో కలిసి నడవాలనుకుంటున్నామనీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలిపారు.
అలాగే అదే విధంగా ఇదే వేదికపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ కూడా ఈ విధంగా స్పందించారు. ఎలాంటి షరతులూ విధించకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చారని అన్నారు. నిజానికి 2014 ఎన్నికల్లోనే పవన్ కళ్యాణ్, బీజేపీకి ఇటు టిడిపికి ఇద్దరికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. అయితే, ఆ తర్వాత క్రమక్రమంగా రెండు పార్టీల మధ్యా కొంత గ్యాప్ పెరిగింది. ఆ తర్వాత ఆయన టిడిపి నుంచి కూడా బయటకు రావడం తెలిసిన విషయమే. టిడిపి నుంచి కూడా ఆయన అనుకున్న పాలనను ఇవ్వలేకపోయానని అప్పట్లో తెలిపారు.
ఇకపోతే పవన్, టీడీపీతో కుమ్మకయ్యారనే వైసీపీ ప్రచారం నేపథ్యంలో.. బీజేపీ, పవన్‌కి కూడా దూరమయ్యింది. ఆ మాటకొస్తే, పవన్ కూడా టీడీపీ ట్రాప్ లోంచి బయటకు రాలేకపోయారన్నది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఇక ఇప్పుడైనా పవన్, టీడీపీకి పూర్తిగా దూరమవుతారని అనుకోవాలా.? లేదా అన్నది కూడా చాలామందిలో ఉన్న అనుమానమే. ఇదంతా మళ్ళీ బిజెపి, టిడిపి, జనసేన కలిసి ఆడుతున్న నాటకమా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
గత ఎన్నికల్లో బిజెపి అగ్ర నాయకత్వంతో విభేధించిన చంద్రబాబు నాయుడు ఈ ఎన్నికల్లో బొక్కబోర్లా పడ్డాక ప్లేటు పిరాయించి కమలంతో సఖ్యతకు సంకేతాలు పంపుతున్నారు. అలాగే ఆ పార్టీ ఐదుగురు రాజ్యసభసభ్యులను ముందస్తు ప్రణాళిక ప్రకారమే బిజెపిలోకి పంపిచారన్న వాదనలు కూడా లేకపోలేద. ఇక ఇప్పుడు జనసేన బిజెపితో జతకట్టడంతో బాబు మాస్టర్ ప్లాన్‌గా అందరూ భావిస్తున్నారు. మొత్తమ్మీద, బీజేపీ – జనసేన కలయిక అయితే జరిగింది. ఈ కలయిక ఎన్నాళ్ళు కొనసాగుతుందో వేచి చూడాలి. ప్రజలకు జనసేన, బీజేపీతో కలవడంపై ఏం సమాధానం చెబుతుంది.? అన్నది తెలియాలి.