Cinema

త‌మిళ ద‌ర్శ‌కుడిపై మ‌న‌సు ప‌డ్డ బ‌న్ని…

                                                                     (ధ్యాన్)

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ త‌మిళంలో న‌టించాల‌ని.. త‌మిళ మార్కెట్‌ను పెంచుకోవాల‌ని చాలా రోజులుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. అందుకు త‌గిన‌ట్లు తెలుగు, త‌మిళంలో ఓ సినిమాను స్టార్ట్ కూడా చేశాడు. దీనికి లింగుస్వామి ద‌ర్శ‌కుడు.  అయితే కార‌ణాలు తెలియ‌లేదు కానీ.. సినిమా ఆగిపోయింది. త‌ర్వాత బ‌న్ని తెలుగులో సినిమాల‌పై ఫోక‌స్ పెట్టుకున్నాడు. అడ‌పా ద‌డ‌పా బ‌న్ని సినిమా ఆగిపోలేదంటూ.. వార్త‌లు విన‌ప‌డుతూనే వ‌చ్చాయి. లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం బ‌న్ని, లింగుస్వామి సినిమా ఆగిపోయిన‌ట్లే.. ఎందుకంటే అల్లు అర్జున్ కొత్త త‌మిళ చిత్రం చేయ‌బోతున్నాడ‌ని స‌మాచారం.

విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ప్ర‌కారం ఈ సినిమాను డైరెక్ట‌ర్ శివ తెర‌కెక్కించ‌నున్నాడు. ఈయ‌న త‌మిళంలో అజిత్‌తో వీరం, వేదాలం, వివేగ‌మ్ సినిమాలు చేశారు. ఇప్పుడు విశ్వాసం సినిమా చేస్తున్నాడు. గ‌తంలో శివ తెలుగులో శౌర్యం, శంఖం సినిమాలు చేశాడు. కాగా.. ఈ సినిమా పూర్త‌యిన త‌ర్వాత బ‌న్నితో తెలుగు, త‌మిళంలో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ అధినేత జ్ఞాన‌వేల్ రాజా నిర్మించ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన వివ‌రాలు తెలుస్తాయి. 

 
0
Telugurajyam
Read
Special
Ads
Follow us:

Copyright © 2018 TeluguRajyam

To Top