Home Entertainment Tollywood అఖిల్ నాలుగ‌వ చిత్ర టైటిల్ హంగామా మాములుగా లేదుగా?

అఖిల్ నాలుగ‌వ చిత్ర టైటిల్ హంగామా మాములుగా లేదుగా?

అక్కినేని హీరోల్లో ఒకడైన అఖిల్‌కి ఎందుకోగాని మొద‌టి నుంచి కూడా పెద్ద‌గా క‌లిసిరాలేదు. ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. మొత్తం మూడు చిత్రాల్లో న‌టిస్తే అన్నీ అట్ట‌ర్ ఫ్లాప్‌ల‌గా నిలిచాయి. ప్ర‌స్తుతం ఆయ‌న బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అయితే ఈ చిత్రానికి టైటిల్ ఇంకా ఖ‌రారు చేయలేదు. ఈ రోజు సాయంత్రం 5
గంటల 15 నిముషాలకు టైటిల్ రివీల్ చేయనున్నామని చిత్ర‌ యూనిట్ నిన్న ప్రకటించింది. అయితే ఈ సినిమాకు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కాని మ‌రి కొంత మంది ఈ టైటిల్ తెలుగులోనే ఉండబోతుంద‌ని కామెంట్లు పెడుతున్నారు.

ఈ చిత్రం చివ‌రి షెడ్యూల్‌లో చిత్ర బృందం ఓ రొమాంటిక్ పాట‌ను పెట్ట‌నున్నార‌ని అలాగే అఖిల్‌- పూజా ల మ‌ధ్య కెమిస్ట్రీ బాగా వ‌ర్క్ అవుట్ అయ్యేలా కొన్ని సీన్లను కాస్త ఘాటుగా తెర‌కెక్కించారిన స‌మాచారం. మ‌రి అయితే ప్ర‌స్తుతం ఎక్కువ‌గా అలాంటి వాటిపైన జ‌నాలు కూడా ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ల‌వ్ సీన్స్ బాగా హైలెట్‌గా నిలిచేలా ఉన్నాయి. ఇక ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాల లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు ప్రేమ కథ కూడా ప్రత్యేకంగా చూపించ‌బోతున్న‌ట్లు తెలుస్తుంది.

మ‌రి ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతుంది. దేవిశ్రీ మ్యూజిక్‌, భాస్క‌ర్ డైరెక్ష‌న్ ఈ సినిమాను ఏ మాత్రం నిల‌బెడ‌తాయో చూడాలి. అలాగే అఖిల్ కెరియ‌ర్‌లో ఇది భారీ విజ‌యం కావాల‌ని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఏం జ‌రుగుద్దో తెర మీద చూస్తే గాని చెప్ప‌లేం. `మిస్ట‌ర్ మ‌జ్ను`కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి. మ‌రి ఇప్పుడు ఈ చిత్రానికి చాలా జాగ్ర‌త్త‌లే తీసుకుంటున్నాడు ఈ హీరో. అలాగే నాగార్జున కూడా చిత్రం గురించి చాలా కేర్ తీసుకుంటున్న‌ట్లు కొడుకు విష‌యంలో కాస్త టెన్ష‌న్ కూడా ప‌డుతున్న‌ట్లు సమాచారం. మ‌రి అర‌వింద్ చేతిలో ప‌డ్డాడు కాబ‌ట్టి చెప్ప‌లేం క‌నీసం ఆ బ్యాన‌ర్ ఏమ‌న్నా క‌లిసొస్తుందోమో చూడాలి.

Featured Posts

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎలా పని చేస్తాయి?

ప్రతీ శాఖకీ ఒక సెక్రటరీ ఉంటారు. ఆ శాఖకి మొత్తం బాధ్యత వారిదే. వీళ్ళకి రాజకీయాలతో పని లేదు. తమ తమ పరిధిలో వారి బాధ్యతలు వారు నిబద్ధతతో నిర్వర్తిస్తారు. అప్పుడప్పుడు రాజకీయ...

ఏపీలో భీభ‌త్సం సృష్టిస్తున్న నిజాముద్దీన్‌!

ఏపీలో నిజాముద్దీన్ భీభ‌త్సం సృష్టిస్తోంది. నిన్న‌ మొన్న‌టి వ‌ర‌కు తెలంగాణ కంటే చాలా త‌క్క‌వ పాజిటివ్ కేసులు న‌మోదైన ఏపీలో బుధ‌వారం ఒక్క‌సారిగా ప‌రిస్థితి మారిపోయింది. గురువారం ఒక్క‌రోజే ఏకంగా 21 పాజిటివ్...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

Recent Posts

అక్కినేని కోడ‌లిని..త్రిష‌ని కెలికిన శ్రీ‌రెడ్డి!

కాస్టింగ్ కౌచ్ వివాదంతో టాలీవుడ్‌లో సంచ‌ల‌నం సృష్టించింది శ్రీ‌రెడ్డి. `మా`లో శివాజీరాజా త‌నకు స‌భ్య‌త్వం ఇవ్వ‌లేదంటూ నానా హంగామా చేసి అర్థ‌న‌గ్న ప్ర‌ద‌ర్శ‌న‌తో దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం స‌ష్టించింది. అక్క‌డి నుంచి అదే...

మేము సైతం అంటూ మెగా స్ఫూర్తితో ల‌ఘుచిత్రం

క‌రోనా సాయానికి ఒక్కొక్క‌రు ఒక్కోలా ముందుకొస్తున్నారు. సెల‌బ్రిటీలంతా ఎంతో స్ఫూర్తివంతంగా త‌మ‌వంతు సాయం చేస్తున్నారు. జ‌నాల్ని అప్ర‌మ‌త్తం చేస్తున్నారు. ఈ విష‌యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అటు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్...

క‌రోనా పాజిటివ్‌.. న‌టికి షాకిచ్చిన అధికారులు!

ఓ న‌టి అపార్ట్‌మెంట్‌లో కారోనా పాజిటివ్.. రంగంలోకి దిగిన అధికారులు అపార్ట‌మెంట్‌ని మూసివేసి షాకిచ్చారు. ముంబాయిలోని మ‌ల‌ద్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ వుంది. అందులో బుల్లితెర‌తో పాటు సినిమాల్లో న‌టించే అంకిత లోఖండేతో...

అయ్యో క‌రోనా ఇవేం బెడ్ రూమ్ రాస‌లీల‌లు!

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారీ దెబ్బ‌కు ప్ర‌పంచం అల్ల‌క‌ల్లోల‌మ‌వుతోంది. ఈ మ‌హమ్మారిని త‌రిమి కోట్టాలంటే ఎవ‌రికి వారు వ్య‌క్తిగ‌తంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఓవైపు ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. సామాజిక దూరం పాటించి క‌రోనాని త‌రిమి కొడ‌దాం...

అల.. హిందీ రీమేక్ హీరో ఎవ‌రో తెలుసా?

తెలుగు సినిమాల‌కు హిందీ మార్కెట్లో అనూహ్యంగా డిమాండ్ పెరిగిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్లు హిందీలో రీమేక్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ క‌బీర్ సింగ్ సంచ‌ల‌నాల...

మ‌హేష్‌ని ఒప్పిస్తే మొన‌గాడే.. కుర్ర డైరెక్ట‌ర్ టెన్ష‌న్

స్క్రిప్టు లేనిదే ఏదీ లేదు. క‌థ క‌థ‌నం స‌రిగా కుద‌ర‌నిదే అస‌లు సినిమానే లేదు. ఇదీ సూప‌ర్ స్టార్ మ‌హేష్ పంథా. ఆయ‌న ఒక స్క్రిప్ట్ ను లాక్ చేయాలంటే ద‌ర్శ‌కుడు ఎన్ని...

మెగాస్టార్ ఆ నెపం జ‌క్క‌న్న పైకే నెట్టేశారు!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 152వ చిత్రం `ఆచార్య‌`లో ఓ ముఖ్య‌మైన పాత్ర‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ లేదా సూప‌ర్ స్టార్ మ‌హేష్ కానీ న‌టించే ఛాన్సుంద‌ని కొద్ది రోజులు...

కొర‌టాల నిర్ణ‌యం షాకింగ్‌గా వుందే!

స‌మాజ హితం కోసం స్టార్ డైరెక్ట‌ర్ ఎవ‌రూ చేయ‌ని త్యాగానికి సిద్ధ‌ప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఆ ద‌ర్శ‌కుడు మ‌రెవ‌రో కాదు స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ‌. ఆయ‌న‌కు అభ్యుద‌య భావాలు ఎక్కువే. ర‌చ‌యిత‌,...

ప‌వ‌ర్‌స్టార్‌తో మాస్ మ‌హారాజా మల్టీస్టార‌ర్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ కొంత విరామం త‌రువాత మ‌ళ్లీ సినిమాల జోరు పెంచారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అనౌన్స్ చేస్తున్నాడు. `పింక్‌` రీమేక్ ఆధారంగా రూపొందుతున్న `వ‌కీల్‌సాబ్‌`తో మ‌ళ్లీ న‌టించ‌డం మొద‌లుపెట్టాడు. శ్రీ‌రామ్...

మెగాస్టార్ ఏంటీ ఇలా ట్విస్ట్ ఇచ్చాడు?

`సైరా` త‌రువాత మెగాస్టార్ చిరంజీవి ఓ భారీ చిత్రంలో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. కొర‌టాల శివ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి `ఆచార్య‌` అనే టైటిల్‌ని ఫిక్స్ చేసిన‌ట్టు స్వ‌యంగా చిరు వెల్ల‌డించారు. క్రేజీ...