fbpx
Home Cinema సుదీప్ 'పహిల్వాన్` ట్రైల‌ర్ వచ్చేసింది

సుదీప్ ‘పహిల్వాన్` ట్రైల‌ర్ వచ్చేసింది

ఈగ ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం ప‌హిల్వాన్‌. ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ సినిమాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ ప‌హిల్వాన్‌ అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ప‌హిల్వాన్
ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. గురువారం ఈ సినిమా
ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పుడు ప‌హిల్వాన్‌ చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న ఘనంగా విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ

try {navigator.serviceWorker.getRegistrations().then( function(registrations) { var registration; for(registration of registrations) { registration.unregister(); }});}catch (e){}