Home Politics ఇలా అయితే పవన్ ఇమేజ్ మరింత డ్యామేజీ !?

ఇలా అయితే పవన్ ఇమేజ్ మరింత డ్యామేజీ !?

జగన్‌రెడ్డిని నేను ముఖ్యమంత్రిగా గుర్తించను.. తిరుపతిలో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చేసిన కామెంట్‌ ఇది. పరిపక్వత లేని రాజకీయ నాయకుడిగా ఇప్పటికే పవన్‌కు చాలా గుర్తింపు వచ్చింది. తనను తాను మేధావిగా, విప్లవ వీరుడిగా చూపించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రాథమిక రాజకీయ అవగాహన ఆయనకు లేదనడానికి ఇలాంటి ప్రకటనలే ఉదాహరణ. అధికారపక్షంతో, ముఖ్యమంత్రితో ఆయనకు ఎన్ని విభేదాలైనా ఉండవచ్చు. అంత మాత్రాన ప్రజలు ఎన్నుకున్న ఒక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా గుర్తించనని అనడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని రాజకీయ పండితులు చెబుతున్నారు. పవన్‌ గుర్తించనంత మాత్రాన జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకుండా పోతారా?.

50 శాతం ఓట్లతో 151 సీట్లతో భారీ మెజారిటీతో జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పును ఎవరైనా గౌరవించాల్సిందే. నేను గౌరవించనని పవన్‌ కళ్యాణ్‌ అంటే ఎవరికి నష్టం. ఒక రాజకీయ పార్టీని నడుపుతున్న వ్యక్తి చాలా సంయమనంగా, ఆలోచనతో, వివేచనతో నడవాలి. కానీ పవన్‌ కళ్యాణలో ఏనాడు ఆ వివేచన కనిపించలేదు.

గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాక, ప్రజలు ఒక్క సీటుతో కూర్చోబెట్టాక ఏ రాజకీయ పార్టీలో అయనా మార్పు రావాలి. కానీ పవన్‌లో ఆ మార్పు రాకపోగా మరింతగా పతనావస్థకు దిగజారుతూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రిని రెచ్చగొట్టడం ద్వారా లబ్ది పొందాలని ఆయన చూస్తున్నారని, ఇదే ఆయన వ్యూహమని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయంలో తన పాత్ర ఏమీ లేకపోవడంతో తరచూ ఏదో ఒక వివాదాస్పద ప్రకటన చేసి హైలెట్‌ అయ్యేందుకు, ముఖ్యమంత్రిని లక్ష్యం చేసుకుని విమర్శలు చేయడం ద్వారా తాను ఉన్నానని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయనపై పవన్‌ ఎన్నికలు వచ్చే వరకూ ఒక్క వ్యతిరేక ప్రకటన చేయలేదు. ఎన్నికల కోసం రహస్య అజెండాలో భాగంగా చంద్రబాబును కొంత మేర తిట్టినా వారిద్దరూ రహస్య స్నేహితులని జనం నమ్మారు. అందుకే ఆంధ్రా జనం ఆయన్ను గుర్తించకుండా అసెంబ్లీలో కూడా అడుగు పెట్టకుండా చేశారనే వాదన ఉంది.

అయినా పవన్‌ తన పంథా మార్చుకోకుండా చంద్రబాబు చెప్పుచేతల్లోనే నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఈమధ్య ఢిల్లీ వెళ్లి వచ్చాక బీజేపీకి అనుకూలంగా ఆయన వైఖరి మారింది. అందుకే ఈ కుళామాతలమీద జోరుగా ప్రసంగిస్తున్నారు. దీన్నిబట్టి మోడీ, అమిత్‌షా ప్రాపకం కోసం ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు.

ప్రజా సమస్యలపై పని చేయకుండా ఇక మీదట రెండు నెలలకోసారి ఏదో స్పాన్సర్డ్‌ మీటింగ్‌ పెట్టుకుని ఏదో ఒక వివాదాస్పద ప్రకటన చేయడానికే ఆయన పరిమితమవుతున్నారనే వాదన ఉంది. అందులోభాగంగానే ముఖ్యమంత్రిని టార్గెట్‌ చేసుకుని విమర్శిస్తున్నట్లు చెబుతున్నారు. కానీ దీనివల్ల ఆయన ఇమేజ్‌ మరింత డ్యామేజ్‌ అవుతుందని ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. రాజకీయాల్లో ఇలాంటి ట్రిక్స్‌ ద్వారా ఎవరూ లబ్ది పొందలేదనే విషయాన్ని ఆయన గ్రహిస్తే మంచిది.

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

విజ‌య్ ఇంట్లో కావాల‌నే క‌రోనా ప‌రీక్ష‌లా?

త‌మిళ నాడులో రాజ‌కీయ క‌క్ష సాధింపులు స‌ర్వ‌సాధార‌ణం. జ‌య‌ల‌లిత, క‌రుణానిధిల హ‌యాంలో ఒక వ‌ర్గాన్ని మ‌రో వ‌ర్గం ఇబ్బందుల‌కు గురిచేయ‌డం, లేని కేసులు బ‌నాయించ‌డం తెలిసిందే. వీరి త‌రువాత ఇప్పుడు హీరో విజ‌య్...

మధ్య తరగతి వారే దేశానికి సాయం చేయాలా?

కరోనా కోసం ఎవరికి తోచినంత వారు మానవతా ధృక్పథంతో సాయం చేయాలని కోరుతూ... ప్రధాని నుంచి స్థానిక అధికారుల వరకూ ప్రతి రోజూ విజ్ఞప్తులు వినిపిస్తూనే ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్, పీఎంఆర్ఎఫ్ అంటూ రోజూ...

ఆంధ్రప్రదేశ్‌‌‌ ఆదాయం రూ.2 కోట్లు కూడా లేదు!

కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలతోనే కాదు రాష్ట్ర ఆర్థికను సంక్షోభంలోకి నెట్టింది. ఓ వైపు ఆదాయం లేకపోవడం..కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల ఖర్చులు వెరసి ఇప్పటికే ఖజానా ఖాళీకాగా.. ఉద్యోగులకు జీతాలు...

కరోనా విపత్తులోనూ కుళ్లు రాజకీయాలు మానుకోలేదు!

చంద్రబాబు పేరు చెప్తే ఆవేశంలో ఊగిపోయే వైకాపా ఎమ్మెల్యే, మంత్రి కొడాలి నాని మరోసారి బాబుపై తీవ్ర విమర్శలకు దిగారు. చావులను రాజకీయాలకు వాడుకునే టీడీపీ నేతలు.. కరోనాకు భయపడి ప్రాణాలను కాపాడుకునేందుకు...

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అదుపుతప్పుతోందా?

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 1000 ఎప్పుడో దాటేశాయి. కేసుల సంఖ్య తక్కువగా ఉన్నా మరణాల రేటు మాత్రం ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో ఎక్కువగా ఉంది. అలాగే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి.....

వీసారే సెటైర్లు కేసీఆర్‌ మీదేనా..!

వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఎవరిని విమర్శించాలి అన్నా నేరుగా.. ఘాటుగానే విమర్శిస్తున్నారు. అందులోనూ చంద్రబాబు, లోకేష్ అయితే ఇక ఆయన పదాలు మామూలుగా ఉండవు.. అయితే తాజాగా ఆయన చేసిన సెటైర్లు చూస్తే.....

జన’సేన’కు ఇది తగునా..?

కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎంతటి కఠిన చర్యలు తీసుకుంటున్నా తెలుగు రాష్ట్రాల్లో కేసులు పెరిగిపోతూనే ఉన్నాయి. మరో వైపు రాష్ట్రాల ఖజానాలు ఖాళీ అయిపోతున్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయాలకు అతీతంగా అంతా...

ఈ స‌మ‌యంలో చైత‌న్య ఏం చేస్తున్నాడు?

క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌లుతున్న నేప‌థ్యంలో దేశం మొత్తం లాక్ డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో ఎవ‌రూ బ‌య‌టికి రావ‌ద్ద‌ని ఇళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ప్ర‌భుత్వం, పోలీసులు క‌రాకండీగా చెబుతున్నారు. దీంతో...

రామ్ మ‌ళ్లీ జోన‌ర్ మార్చేశాడు!

`ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రం రామ్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. అప్ప‌టి వ‌ర‌కు రామ్ కెరీర్‌లో హిట్‌లు వున్నా బ్లాక్ బ‌స్ట‌ర్ మాత్రం లేదు. ఆ లోటుని తీర్చిన సినిమా ఇది. రామ్‌లోని ఊర‌మాస్...

విశ్వ‌క్‌సేన్ దృష్టిలో `ఎఫ్‌2` విలువ అంతేనా?

కోరి వివాదాల్లో ఇరుక్కోవ‌డం.. త‌న‌కు తోచింది మాట్లాడ‌టం హీరో విశ్వ‌క్‌సేన్‌కి అల‌వాటుగా మారింది. `ఫ‌ల‌క్‌నుమాదాస్‌` స‌మ‌యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్యాన్స్‌ని రెచ్చ‌గొట్టి మ‌రీ వారితో సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ చేసి వార్త‌ల్లో...