fbpx
Home Politics నారా లోకేష్ - గత ఐదేళ్లుగా ఒకరకమైన ఆర్గనైజ్డ్ దుష్ప్రచారానికి భలైన వ్యక్తా?

నారా లోకేష్ – గత ఐదేళ్లుగా ఒకరకమైన ఆర్గనైజ్డ్ దుష్ప్రచారానికి భలైన వ్యక్తా?

నారా లోకేష్ – గత ఐదేళ్లుగా ఒకరకమైన ఆర్గనైజ్డ్ దుష్ప్రచారానికి భలైన వ్యక్తా?

ప్రతిపక్ష పార్టీలు రాజకీయ లబ్దికోసం అయన తండ్రి చంద్రబాబు నాయుడు ని ఎదుర్కోవటానికి / విమర్శించటానికి దొరికిన weak point నారా లోకేష్.. కొంత శాతం సామాన్యప్రజలకు, ఆయనేదో తండ్రి వారసత్వాన్ని అడ్డుపెట్టుకొని సులభంగా పదవులు పొందాడని ఒకరకమైన ఈర్ష / అసూయ..ఇంకా సొంత పార్టీ నాయకులు తాము చేసే తప్పులను కవర్ చేసుకోవటానికి, ఆఖరకు పార్టీ ఓడిపోయాక అధికార పార్టీలోకి వెళ్లేముందు blame చేయటానికి కూడా వాడుకునేది నారా లోకేష్.. ఆఖరకు సొంత పార్టీ కార్యకర్తలు కూడా తమ తమ అక్కసు వెళ్లగక్కటానికి ఉపయోగించుకునేది ఆయననే.. అంటే చంద్రబాబుని విమర్శించాలి / తిట్టాలి అనుకున్న వాళ్లంతా అదిచేయలేక లోకేష్ ని వాడుకుంటున్నారు ఏమో అనిపిస్తుంది. ఇలా ప్రస్తుత రాజకీయాలలో వాస్తవాలకు దూరంగా దుష్ప్రచారానికి బలైన దురదృష్టవంతుడు నారా లోకేష్ అని చెప్పవచ్చు!!

కానీ వాస్తవంగా, కాస్త పరిశీలించి, వాస్తవికతతో చూస్తే ప్రచారంలో ఉన్నంతగా ఇంతటి దుష్ప్రచారానికి అయన అర్హుడా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పవచ్చు. ఒక్కసారి అయన వ్యక్తిగత / కుటుంబ నేపధ్యాన్ని పరిశీలిస్తే.. ఆయన పుట్టేసరికి అయన తాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి. బాల్యం దాటేసరికి ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. విదేశాలలో ప్రముఖ విద్యాసంస్థలలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన నేపధ్యం. ఒక మొదటిసారి ఎమ్మెల్యే అయిన సాధారణ శాసనసభ్యుని కొడుకులే, తమ తమ పుట్టినరోజు వేడుకల కోసం రోడ్ల మీద హల్చల్ చేస్తూ, మొత్తం ట్రాఫిక్ అంతా నిలిపేసే డాబు / దర్పం చూపిస్తున్న నేటి రోజుల్లో, తెలుగు జాతి రాజకీయాలు అన్నీ 3 1/2 దశాబ్దాల పైగా వారి చుట్టూనే తిరుగుతున్న కుటుంబం నుండి వచ్చిన నారా లోకేష్ ఎప్పుడూ అలాంటి అధికార జులుం చూపించిన దాఖలాలు లేవే?? కొంత మంది ముఖ్యమంత్రుల కొడుకుల వల్లే, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమార్జనకు ఒడికట్టారనే ఆరోపణలతో వారం వారం కోర్టు బోనులో నిలబడటం లేదే?? ఇంకా చెప్పాలంటే ఇలాంటి నెగటివ్ ఏమీ లేకనే, విదేశాలలో చదువుకోవటంతో, తెలుగులో ధారాళంగా మాట్లాడటంలో ఎప్పుడైనా తడబడటం అనే ఒక్కలోపాన్ని మాత్రమే అయన రాజకీయ ప్రత్యర్థులు / విమర్శకులు లేవనెత్తుతున్నారు అని చెప్పవచ్చు.. ఒక్క ఈ లోపాన్ని తప్ప ఇంకా ఏదీ ఇప్పటివరకూ చూపకుండా ఉండటమే అయన గొప్పతనాన్ని చూపుతుంది.. అయన పంచాయితీ రాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో గ్రామాలలో వేసిన సిమెంట్ రోడ్లు, వెలిగిన LED లైట్లు, నిర్మించిన పంచాయితీ భవనాలు / శ్మశానవాటికలు.. అలాగే ఐటీ శాఖామాత్యులుగా అయన ప్రయత్నించి తీసుకొని వచ్చిన ప్రతిష్టాత్మక కంపెనీలు అయన పనితీరుకు / సమర్ధతకు నిదర్శనంగా కనిపిస్తూనే ఉన్నాయి!!

Kalyan Guttikonda

Gallery

తాజా వార్తలు

అత్యంత ప్రజాధారణ