Home News Andhra Pradesh జగన్ కి పిచ్చెక్కిస్తున్న ఢిల్లీ రాజకీయాలు?

జగన్ కి పిచ్చెక్కిస్తున్న ఢిల్లీ రాజకీయాలు?

రాష్ట్రంలో తనకు ఎదురులేదన్నట్లు ముందుకెళుతున్న జగన్‌ ఢిల్లీ రాజకీయంలో నలిగిపోతున్నారు. బీజేపీ, టీడీపీయే కాకుండా సొంత పార్టీ ఎంపీలు ఒకరిద్దరు కూడా హస్తినలో ఆయనకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఒకవైపు ప్రధాని మోడీ, అమిత్‌షాలను ప్రసన్నం చేసుకోలేక నానా ఇబ్బందులు పడుతూనే పార్టీతో సంబంధం లేకుండా ఢిల్లీలో చక్రం తిప్పుతున్న ఎంపీ రఘురామకృష్ణంరాజును అదుపులో పెట్టలేక కస్సుబుస్సులాడుతున్నారు.

ఆరు నెలల క్రితం మునుపెన్నడూ చూడని విధంగా ఆంధ్రాలో స్టన్నింగ్‌ విక్టరీని అందుకుని మోడీ చేత శభాష్‌ అనిపించుకున్న జగన్‌ ఇప్పుడు ఆయన అపాయింట్‌మెంట్‌ కూడా దొరక్క ఆపసోపాలు పడుతున్నారు. ఏపీలో తమ పార్టీని బలోపేతం చేసుకోవాలనే మోడీ–షా లక్ష్యం, జగన్‌ను వారికి దూరం చేసేలా చంద్రబాబు పన్నిన వ్యూహాలు జగన్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మోడీ–షా ద్వయం జగన్‌ పట్ల అంత వ్యతిరేకతతో లేకపోయినా ఇటీవల కొన్ని పరిణామాలు వారి మధ్య దూరాన్ని పెంచాయి.

జగన్‌ క్రిస్టియానిటీని ప్రోత్సహిస్తున్నారనే అనుమానాలు, ఎల్వీ సుబ్రహ్మణ్యం వంటి అధికారులను అవమానకరంగా సాగనంపడంతోపాటు తాము చెప్పిన కొందరు అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కన పెట్టడం వారికి రుచించడంలేదు. మొదట ఆర్పీ ఠాకూర్‌కు కీలక పదవి ఇవ్వాలని అమిత్‌షా చెప్పినా జగన్‌ లెక్కచేయలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న మనీష్‌కుమార్‌ సిన్హాను నిఘా విభాగం చీఫ్‌గా నియమించడం వారికి అస్సలు మింగుడుపడలేదు. ఇవికాకుండా సుజనాచౌదరి జగన్‌పై వ్యతిరేకత పెంచడమే లక్ష్యంగా హస్తినలో చేస్తున్న లాబీయింగ్, కేసీఆర్‌–జగన్‌ కలిసి పనిచేస్తున్నారనే వాతావరణంతో అన్ని రకాలుగా జగన్‌కు హస్తినలో ఇబ్బందికర వాతావరణం నెలకొంది.

మరోవైపు సొంత పార్టీకి చెందిన నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీతో సంబంధం లేకుండా ఢిల్లీలో హల్‌ చేస్తుండడం జగన్‌కు ఇబ్బందికరంగా మారింది. ఇటీవల రఘురామకృష్ణంరాజును అమరావతికి పిలిపించుకుని ఢిల్లీలో హడావుడి చేయొద్దని వార్నింగ్‌ ఇచ్చినా ఆయన లెక్క చేయడంలేదు. జగన్, విజయసాయిరెడ్డి ప్రమేయం లేకుండా లోక్‌సభలోని పది స్థాయీ సంఘాల్లో రఘురామకృష్ణంరాజకు చోటుదక్కడం జగన్‌ను నివ్వెరపరిచినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో గతంలో ఎన్నడూ లేని రీతిలో 300 ఎంపీలకు రఘురామకృష్ణంరాజు భారీ విందు ఏర్పాటు చేయడంతో జగన్‌కు బీపీ మరింత పెరిగిపోయింది. ఈ రాజుగారిని కట్టడి చేయలేక చివరికి ఆయనకు రాజకీయంగా చెక్‌ పెట్టే ఉద్ధేశంతో నర్సాపురంలో ఆయన ప్రత్యర్థిగా ఉన్న మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కొడుకు, తమ్ముళ్లను పార్టీలో చేర్చుకున్నారు. అయినా రఘురామరాజు జగన్‌కు ఖాతరు చేసే పరిస్థితిలో లేరని సమాచారం.

Recent Post

వైఎస్ వివేకా డెత్ మిస్టరీ వీడేదెప్పుడు ?

మాజీ మంత్రి వై ఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయిన విషయం తెలిసిందే. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అయన పై హత్యాయత్నం జరగడం సంచలనం రేపింది. ఎంపీ గా ,...

అమ్మఒడి పేరుతొ దోచుకుంటున్నారు : చంద్రబాబు

అమ్మఒడి పేరుతొ నిరుపేదలను దోచుకుంటున్నారు అంటూ మండి పడుతున్నారు టిడిపి నేత చంద్రబాబు నాయుడు. ఆంధ్ర ప్రదేశ్ లో నిరుపేద కుటుంబాల వారు తమ పిల్లలను స్కూల్ కు పంపించేందుకు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన...

ప‌వ‌న్ కోసం బాలీవుడ్ హీరోయిన్‌?

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ `పింక్‌` తెలుగు రీమేక్‌తో రెండేళ్ల విరామం తరువాత మ‌ళ్లీ కెమెరా ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. దిల్‌రాజు, బోనీక‌పూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా రాకెట్ స్పీడుతో షూటింగ్ జ‌రుపుకుంటోంది....

`ఆర్ ఆర్ ఆర్‌`లో మ‌రో హీరోయిన్‌?

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న విజువ‌ల్ వండ‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`. ఈ సినిమా ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి రోజుకో వార్త హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ కొమ‌రంభీం పాత్ర‌లో, అల్లూరి సీతారామ‌రాజుగా రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న...

విశాఖ రాజధానిని చేస్తే సమస్యలు తప్పవు : జిఎన్ రావు కమిటీ

ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానుల అంశం మొత్తానికి చివరి దశకు చేరుకున్నట్టే. శాసన మండలిలో మూడు రాజధానులకు అనుగుణంగా బిల్లు ప్రవేశకా పెట్టకపోవడంతో జగన్ సర్కార్ శాసన మండలి రద్దు దిశగా...

Featured Posts

బిగ్ బ్రేకింగ్‌: గాయ‌ప‌డిన‌ ర‌జ‌నీకాంత్‌

త‌లైవా ర‌జ‌నీకాంత్ గాయ‌ప‌డ్డారు. ఓ డాక్యుమెంట‌రీ షూటింగ్ కోసం మైసూర్‌లోని బండీపూర్ అడ‌వుల‌కు వెళ్లిన ఆయ‌న అదుపు త‌ప్పి కింద‌ప‌డిపోవ‌డంతో స్వ‌ల్ప‌గాయాలైన‌ట్టు తెలుస్తోంది. గ‌త ఏడాది భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీలో డిస్క‌వ‌రీ...

రామ్‌చ‌ర‌ణ్ బ్రిటీష్ అధికారిగానా ఇదేం ట్విస్ట్‌?

`బాహుబ‌లి` విజ‌యంతో తెలుగు సినిమా స్వ‌రూప‌మే ప్రంచ య‌వ‌నిక‌పై స‌మూలంగా మారిపోయింది. టాలీవుడ్‌లో భారీ సినిమా వ‌స్తోందంటే దేశ వ్య‌ప్తంగా అటెన్ష‌న్ క్రియేట్ అవుతోంది. తాజాగా జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న`ఆర్ ఆర్ ఆర్‌`పై...

`వీ` పోస్ట‌ర్ టాక్‌: దేనిని క‌త్తిరించేశాడో ఏమిటో!

నేచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న 25వ‌ చిత్రం `వీ`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్ర‌లు పోషిస్తున్నాడు. ఒక పాత్ర‌లో విల‌న్ గా...

శాసన మండలి రద్దుతో వైసిపికి ప్లస్సెంత? మైనస్సైంత?

  అందరూ ఊహించినట్లుగానే శాసన మండలి రద్దు చేస్తూ శాసన సభలో తీర్మానం చేశారు.ఇక కేంద్రంలో ఉభయ సభలు ఆమోదించిన తదుపరి రాష్ట్ర పతికి వెళ్లి ఆమోద ముద్ర పడితే అంతటితో మండలి కథ...

ప‌వ‌న్ చూడాలంటే అద్భుతం జ‌ర‌గాలంట‌!

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో`. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సాధించి రేసులో ముందుంద‌నిపించింది....