Home News Andhra Pradesh అసలు ఏమైంది భయ్యా నీకు..పవన్ కళ్యాణ్ అభిమాని ఆక్రోశం

అసలు ఏమైంది భయ్యా నీకు..పవన్ కళ్యాణ్ అభిమాని ఆక్రోశం

చరిత్రని సృష్టించే వాడివి అనుకున్నాను. కానీ, చరిత్ర హీనుడువి అయ్యిపోతావేమో అని భయంగా ఉంది..

మొదట్లో నీ సినిమాలకు పిచ్చ ఫ్యాన్ ని అయ్యిపోయాను. హే మేరా జహ , I am an Indian ,నీరల్లే పారలే, గడ్డిపోచ అయిన భూమి చీల్చుకునే పుట్టురా, నజీర్ అన్నయ్య మనలోకం మనకుంది అన్నయ్యో…ఇలా ఫలానా పాటల్లో దర్శకుడి హ్యాండ్ కన్నా, నీ వేలు ఎక్కువ ఉంది అని తెలిసి నీ సామాజిక స్పృహ కి సంతోషించాను. నీ స్వంత ఫైట్ కంపోజింగ్ చూసి అబ్బురపడ్డాను. జానీ ఫ్లాప్ అవ్వొచ్చు గాక.. నాకైతే నచ్చింది . ఆ అల్లు అరవింద్ మాట వినకుండా ఉండి హాలీవుడ్ లెవెల్ లో గంటన్నర సినిమా అయ్యుంటే మాములుగా ఉండేది కాదు.

అసలు సినిమాల్లో నీ నవ్వు, నీ చూపు నా గర్ల్ ఫ్రెండ్ కంటే కూడా ఎక్కువ ఆకర్షించేవి. ఒకవేళ నేను కాపు కావడం మూలాన నువ్వు నాకు నచ్చుతున్నవా.. ఏమో, కులం నరాల్లో జీర్ణించుకునిపోయి తెలియకుండానే పాతుకుపోతుంది. కానీ, నీ విషయంలో అలా కాదు అని నా నమ్మకం.. ఈ దేశానికి నువ్వో మరో చేగువేరా అని నమ్మాను నేను.

ఇక prp ప్లాప్ అయ్యాక, నువ్వు మళ్ళీ మరొక పార్టీ పెడుతున్నావ్ అంటే నేను నమ్మలేదు.. కానీ, పార్టీ ప్రకటన రోజు, విజయవాడ జింఖాన గ్రౌండ్స్ లో పెద్ద తెరపై, ఇల్లేమో దూరం అంటున్న నీ ప్రసంగం చూస్తూ , నీ కంటే ఎక్కువగా ఊగిపోయాను నేను..

ఏవీ స్వామి ఆనాటి అగ్రిసివ్ అటిట్యూటులు… ఆ ఆవేశంలో బోలెడు నిజాయితీ కనిపించేవి..ఆ తర్వాత కూడా నిన్ను నేను బలంగానే నమ్మాను.. రొటీన్ రాజకీయ పార్టీలకు భిన్నంగా ఏమీ చేస్తావా అని ఎదురుచుస్తూనే ఉన్నాను.. కొంచెం తృప్తి..కొంచెం అసంతృప్తి.. నువ్వు రెండు చోట్లా ఓడిపోయిన రోజున పదకొండు రోజులు తిండి మానేయడం కాదుగాని చాలానే బాధపడ్డాను.కానీ, నీ మీద నెగటివ్ ఫీలింగ్ అయితే రాలేదు..

కానీ, ఇప్పుడు దేశాన్ని అభివృద్ధి ఆధారం గా కాకుండా , మతం ఆధారంగా పాలిస్తున్న బీజేపీ పట్ల నీ సానుకూలత చూసి నిజంగా నీమీద కోపం వస్తుంది..

నువ్వు నీలా ఉండు సామీ ..ఎవడి ప్రభావం నీ మీద పడనివ్వకు..ఇప్పటికి నువ్వొక నిప్పు కణిక అని నా నమ్మకం. నీ నిజాయితీ పట్ల అపార నమ్మకం..

అసలు ఆంధ్రలో నరమానవుడికి సాధ్యం కానంత విపరీతమైన క్రేజ్ ఉన్న నిన్ను నేను ఇలా చూడలేను..

నాకు మళ్ళీ ఆ పాత పవన్ కావాలి..come back soon….

The opinion is expressed by Pawan Kalyan fan –

Chinny Ajay

Featured Posts

కరోనా విపత్తులో కూడా కరకట్ట రాజకీయం చేస్తున్న రాధాకృష్ణ!

సాధారణంగా మామూలు ప్రజలకు ఉగాది, శ్రీరామనవమి, దసరా, దీపావళి లాంటివి పండుగలు.  కానీ, క్షుద్రజ్యోతి రాధాకృష్ణకు మాత్రం కరోనా అనే ఒక మహమ్మారి అతి పెద్ద పండుగ.  అందులోనూ తన యజమానికి బద్ధశత్రువు...

జగన్‌ నిర్ణయానికి మద్దతిచ్చిన చంద్రబాబు!

ఉప్పు, నిప్పులా ఒకరిపై ఒకరు చిటపటలాడుతూ.. తీవ్ర విమర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు వారు. కానీ ఇప్పుడు ఒకరు తీసుకున్న కఠిన నిర్ణయానికి మరొకరు మద్దతుగా నిలిచారు. వందశాతం సమర్థించారు. పైగా...

వీరికి  లాక్ డౌన్ వర్తించదా?

 ప్రపంచంలోని నూట తొంభై అయిదు దేశాలను గడగడలాడిస్తూ, ఇప్పటివరకు పద్దెనిమిది వేలమంది ప్రాణాలను తీసి, లక్షలాదిమందికి ఆసుపత్రుల పాలు చేసిన భయంకరమైన కరోనా వైరస్ (కోవిద్ 19 ) ఆ రెండుమూడు గ్రామాల...

Recent Posts

మహేష్ – ప‌ర‌శురామ్ ప్రాజెక్ట్ వెనుక ఇంత‌స్టోరీ వుందా?

`స‌రిలేరు నీకెవ్వరు` హిట్ త‌రువాత కొంత స‌మ‌యం ఫ్యామిలీతో గ‌డిపిన మ‌హేష్ ఆ త‌రువాత వంశీ పైడిప‌ల్లితో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ని చేయాల‌ని ప్లాన్ చేశాడు. అయితే వంశీ పైడిప‌ల్లి చెప్పిన స్క్రిప్ట్...

ఈ టైమ్ ఏంటీ మంచు విష్ణు చేస్తున్న‌దేంటీ?

ఊరంతా కాలిపోతుంటే ఆ మంట‌ల్లో ఒక‌డు చ‌లికాచుకున్నాడ‌ట అన్న‌ట్టుగా వుంది మంచు విష్ణు వ్య‌వ‌హార శైలి. క‌రోనా వైర‌స్ ప్ర‌బ‌ల‌డంతో యావ‌త్ ప్ర‌పంచం ఉక్కిరిబిక్కిరి అవుతూ క్ష‌ణ‌మొక యుగంలా కాలం వెళ్ల‌దీస్తోంది. ఈ...

రౌడీ హీరో ఎందుకు సైలెంట్ అయ్యాడు?

క‌రోనా వైర‌స్ విళ‌య‌తాండ‌వం చేస్తోంది. ప్ర‌పంచ దేశాల‌న్నీ ఆహాకారాలు చేస్తున్నాయి. దేశంలో దీని బారి నుంచి ప్ర‌జ‌లు సేఫ్‌గా బ‌య‌ట‌ప‌డాలంటే సామాజిక దూరం క‌చ్చితంగా పాటించాల్సిందే అంటూ ప్ర‌చారం కూడా మొద‌లైంది. కేంద్రం...

వాళ్లకి కరోనా రావాలని శాపం పెట్టిన తెలుగు సీఎం!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కి కోపం వచ్చింది.. ప్రజలను ఆందోళనకు గురిచేసే వారి పట్ల ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది.. ఇంకేముంది.. అలాంటి వాళ్లను ఏం చేస్తానో చూడండని హెచ్చరించారు. పైగా వాళ్లకు కరోనా రావాలని...

వ‌ర్మ కోసం అక్క‌నే ఆట‌ప‌ట్టించిన‌ మ‌నోజ్!

రామ్ గోపాల్ వ‌ర్మ నిత్య క‌ల‌హ‌భోజ‌రుడి టైపు. అంటే నార‌దుడిలా అన్న‌ట్టు. నిత్యం ఎవ‌రో ఒక‌రిని టార్గెట్ చేస్తూ వార్త‌ల్లో నిల‌వ‌డం వ‌ర్మ‌కు వెన్నెతో పెట్టిన విద్య‌. దాన్నే న‌మ్ముకుని ఇంత కాలంగా...

కరోనా నేపథ్యంలో జగన్ షాకింగ్ నిర్ణయం!

రాష్ట్రంలో రోజు రోజుకు కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా వైరస్ నుండి ఆంధ్రప్రదేశ్ ప్రజలను కాపాడేందుకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ...

రెండు రాష్ట్రాల ఉద్యోగుల జీతాల్లో కోత!

కరోనా ఎఫెక్ట్‌‌తో తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల ఖజానాలు ఖాళీ అయిపోయాయి. ఆదాయం నిలిచిపోయింది. లాక్‌డౌన్‌తోరెవిన్యూ, మైనింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా శాఖలు పూర్తిగా క్లోజ్ అయ్యాయి. ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయింది. దీంతో...

నీ విరాళం వద్దుపో..!? చిత్తూరు జిల్లాలో రాజకీయాల పర్యవసానం!

ఇప్పుడు జరుగుతోంది ఎన్నికలు కాదు, గెలుపు ఓటముల ఆరాటం కాదు.. ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్య సిబ్బంది.. పోలీసులు ఇలా ప్రతి ఒక్కరు చేస్తోన్న పోరాటం. ఈ పోరాటంలో ప్రభుత్వానికి...

పాపం బాబు! విరాళం ఇచ్చినా విలువ లేకుండా పోయే?

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఏం చేసినా అదో వివాదాస్పదమే అయిపోతోంది. చివరికి కరోనా కట్టడికి ప్రభుత్వానికి తన వంతుగా ఆయన ఇచ్చిన రూ.10లక్షల సాయంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. ఆయనేమో తెలంగాణలో...

గాయ‌ని స‌్మిత‌ ఆస్ట్రాల‌జీ వివాదం కాదుక‌ద‌!

మంచి చెబితే చెడు జ‌రిగే రోజులివి. జ‌నానికి మంచి చేయాల‌ని ప్ర‌య‌త్నించినా ఆ విష‌యంలో ఆచి తూచి వ్యంహ‌రించాల్సి వుంటుంది. మ‌న‌కు తెలుసుక‌దా అని జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా చెబితే అది మొద‌టికే మోసం...