మనలో చాలామంది సులువుగా లోన్ పొందాలని అనుకుంటున్నారు. లోన్ పొందాలని భావించే వాళ్లలో తక్కువ వేతనం ఉన్నవాళ్లకు లోన్ పొందడం కష్టమవుతుంది.
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ సులువుగా లోన్ పొందాలని భావించే వాళ్లకు ఆన్ లైన్ లెండింగ్ ఫ్లాట్ ఫామ్స్ లోన్ అందిస్తున్నాయి.
లోన్ యాప్స్ ద్వారా తక్కువ వేతనం ఉన్నవాళ్లు కూడా లోన్ పొందవచ్చు.45 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు లోన్ పొందడానికి అర్హులు కాగా గరిష్టంగా
4 లక్షల రూపాయల వరకు సులువుగా లోన్ పొందే అవకాశం అయితే ఉంటుంది. ఆధార్, పాన్ కార్డులతో పాటు శాలరీ స్లిప్, బ్యాంక్ స్టేట్ మెంట్ లను ఇవ్వడం ద్వారా
సులువుగా లోన్ ను పొందవచ్చు. అయితే వడ్డీరేట్లు మాత్రం బ్యాంక్ వడ్డీ రేట్లతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం ఉంటాయని గుర్తుంచుకోవాలి.
ప్రతి నెలా వాయిదాల పద్దతిలో లోన్ ను చెల్లించే అవకాశం అయితే ఉంటుంది. 10,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు లోన్ ను పొందవచ్చు.
అయితే రివ్యూల ఆధారంగా లోన్ యాప్స్ ను ఎంచుకుంటే మంచిది. కొన్ని లోన్ యాప్స్ లో డబ్బు తీసుకుంటే మాత్రం నిత్య జీవితంలో
ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లోన్ కు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఆన్ బోర్డ్ ఫీజును సైతం చెల్లించాల్సి ఉంటుంది.
ఎంచుకునే టెన్యూర్ ను బట్టి వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. వేతనం ఆధారంగా టెన్యూర్ ను ఎంపిక చేసుకోవాలి.
అత్యవసరం అయితే మాత్రమే లోన్ యాప్స్ సాయంతో లోన్ తీసుకుంటే మంచిది.