కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ లో బెస్ట్ స్కీమ్ ఏదనే ప్రశ్నకు సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ పేరు సమాధానంగా వినిపిస్తుంది.
ఎలాంటి రిస్క్ లేకుండా డబ్బులను ఇన్వెస్ట్ చేసే స్కీమ్స్ లో ఈ స్కీమ్ ఒకటి కాగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు ఆదాయపు పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు.
ప్రస్తుతం ఈ స్కీమ్ పై కేంద్రం 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తుండటం గమనార్హం.ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ స్కీమ్ కు సంబంధించిన వడ్డీరేట్లు మారతాయి.
ఇతర సేవింగ్స్ స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ స్కీమ్ లో వడ్డీ రేటు ఎక్కువగా ఉండటంతో ఈ స్కీమ్ ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ప్రతి సంవత్సరం గరిష్టంగా లక్షన్నర రూపాయల వరకు డిపాజిట్ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తోంది.రోజుకు కనీసం 100 రూపాయల చొప్పున నెలకు 3,000 రూపాయలు
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోజుకు 100 రూపాయలు పొదుపు చేసినా మెచ్యూరిటీ సమయంలో
15 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయికి 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఈ స్కీమ్ అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది.
15 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అమ్మాయికి 21 సంవత్సరాల వయస్సు వచ్చినప్పుడు ఈ స్కీమ్ అకౌంట్ మెచ్యూరిటీ అవుతుంది.
డిపాజిట్ చేసిన మొత్తంలో కొంత మొత్తాన్ని 18 సంవత్సరాల తర్వాత విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సమీపంలోని
పోస్టాఫీస్ లేదా బ్యాంక్ ను సంప్రదించి సులువుగా ఈ స్కీమ్ లో చేరవచ్చు. ఈ స్కీమ్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా సంబంధిత వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.