చాక్లెట్లను అతిగా తినడం ఆరోగ్యానికి మంచిది కాదన్న విషయం మనందరికీ తెలిసినప్పటికీ అవేవీ లెక్కచేయకుండా చాక్లెట్ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటుంటాం.
ఇక పిల్లల విషయానికొస్తే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటా! చాక్లెట్లను పరిమితంగా తింటే మన ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను అందించడంతోపాటు తక్షణ శక్తిని అందిస్తాయి.
ముఖ్యంగా చాక్లెట్లను ఖాళీ కడుపుతో తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని న్యూట్రిషన్ నిపుణులు చెబుతున్నారు.
మనలో చాలామంది ఖాళీ కడుపుతో చాక్లెట్లను ఎక్కువగా తింటుంటారు. దీనివల్ల మన ఆరోగ్యానికి మరింత ప్రమాదం వాటిల్లుతుంది.
చాక్లెట్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో పాటు కొన్ని రసాయనాలు కూడా ఉంటాయి. కావున ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాక్లెట్ తింటే
మన శరీరం తొందరగా రసాయనాలను గ్రహిస్తుంది తద్వారా జీర్ణ శక్తి మందగించి కడుపులో మంట, వికారం, మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి.
చాక్లెట్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి కావున ఉదయాన్నే వీటిని తింటే శరీరం తొందరగా గ్రహించి రక్తంలో అమాంతం గ్లూకోజ్ శాతం పెరిగి డయాబెటిస్ వ్యాధికి కారణం కావచ్చు.
ఫలితంగా అలసట నీరసం వంటి లక్షణాలు రోజంతా మిమ్మల్ని వేధిస్తాయి. చాక్లెట్లను అతిగా తింటే మన శరీరానికి అదనపు క్యాలరీలు లభించి శరీర బరువు తొందరగా పెరుగుతుంది
తద్వారా ఉభకాయ సమస్య తలెత్తుతుంది. ఫలితంగా రక్త పోటు, గుండెపోటు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఒకవేళ ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాక్లెట్లను తినాల్సి వస్తే మొదట గోరువెచ్చని నీళ్లను తాగిన అర్థగంట తర్వాత
ఏ ఆహారానైనా తినవచ్చు. ఏది ఏమైనా చాక్లెట్లను అతిగా తినడం అనారోగ్యానికి సూచికగా చెప్పవచ్చు.