ప్రయాణికులకు గుడ్ న్యూస్… ఇలా టికెట్ రద్దు చేసుకుంటే ఎలాంటి చార్జెస్ ఉండవు తెలుసా?
సాధారణంగా మనం ఏదైనా దూర ప్రయాణాలకు వెళ్లాలంటే ముందుగానే టికెట్ బుక్ చేసుకోవడం జరుగుతుంది అది బస్ అయిన ట్రైన్ అయిన లేదా ఫ్లైట్ అయిన.
ఇలా దూర ప్రయాణాలు చేసే వాళ్ళు ఒకరోజు ముందుగా లేదా కొన్ని నెలలు ముందుగా కూడా టికెట్ బుక్ చేసుకుంటూ ఉంటారు.
అయితే కొన్ని అనగా కారణాలవల్ల తీర ప్రయాణం చేసే ముందు మనం ప్రయాణించ లేకపోవడంతో కొన్నిసార్లు ఆ టికెట్లను రద్దు చేసుకుంటూ ఉంటాము.
ఈ విధంగా బుక్ చేసిన టికెట్లను రద్దు చేస్తే కనుక కొంత డబ్బు కట్ చేసుకుని తిరిగి మిగిలినది మనకు వాపస్ చేస్తారు.
అయితే మనం ప్రయాణించడానికి కొన్ని గంటల ముందు మన టికెట్ కనుక రద్దు చేసుకుంటే దాదాపు సగం డబ్బులు మాత్రమే మనకు చెల్లించడం జరుగుతుంది.
అయితే ఇకపై ఎలా టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలనుకునేవారు ఇలా చేయటం వల్ల ఎలాంటి డబ్బు కాకుండా మొత్తం డబ్బు మీకు వాపస్ వస్తుంది.
ఇలా తరచూ టికెట్ బుక్ చేసుకుని రద్దు చేసుకోవడం వల్ల చాలామంది పెద్ద మొత్తంలో డబ్బు నష్టపోవాల్సి వస్తుంది.
ఇలా డబ్బులు నష్టపోకుండా నివారించడం కోసం Paytm Cancel Protect ఒక కొత్త ఆఫర్‌తో ముందుకు వచ్చింది.ఈ స్కీమ్ ప్రకారం.. మీరు పేటీఎం ద్వారా విమానం,
బస్సు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు… రద్దు చేయవచ్చు. ఇందు కోసం ఎలాంటి ఛార్జీలు ఉండవు. కానీ మీ డబ్బు పూర్తిగా వాపసు చేస్తారు.
అయితే విమానం టికెట్ రద్దు చేసుకోవాలంటే 24 గంటలు ముందు రద్దు చేసుకోవాలి అలాగే బస్సు ప్రయాణంలో టికెట్ రద్దు చేసుకోవాల్సి వస్తే
నాలుగు గంటల ముందు టికెట్ రద్దు చేసుకున్న ఎలాంటి డబ్బులు కట్ అవ్వకుండా మీరు టికెట్టు కోసం ఎంత చెల్లించారు అంత డబ్బు తిరిగి వస్తుంది.