బీజేపీకి దగ్గుబాటి పురంధేశ్వరి రాజీనామా చేస్తారా.? టీడీపీలోకి ఆమె జంప్ చేయబోతున్నారా.?
అటు కమలం పార్టీలోనూ, ఇటు సైకిల్ పార్టీలోనూ ఈ విషయమై పెద్ద రచ్చే జరుగుతోంది. భువనేశ్వరిద్వారా పురంధేశ్వరిపై చంద్రబాబు ఒత్తిడి చేయిస్తున్నారట.
బీజేపీలో వుండడం వల్ల రాజకీయంగా ఎలాంటి ఉపయోగమూ వుండదని చంద్రబాబు చెప్పిస్తున్నారట పురంధేశ్వరికి.
నిజానికి, ఒకప్పటి వైరం పురంధేశ్వరికీ, చంద్రబాబుకీ మధ్య లేదు. పురంధేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా చంద్రబాబుతో గత వైరానికి చెక్ పెట్టారు.
పైగా, ప్రత్యక్ష రాజకీయాలకు తాను దూరమని కూడా ఆయన ప్రకటించేశారు. దగ్గుబాటి పురంధేశ్వరి మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా యాక్టివ్గా వున్నారు.
బీజేపీ కోసం పురంధేశ్వరి ఎంతగా కష్టపడుతున్నా, బీజేపీ పుంజుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపించడంలేదు. పోనీ,
రాజ్యసభ లాంటి పదవి ఏదన్నా ఆమెకు ఇచ్చి జాతీయ స్థాయిలో ఆమెను బీజేపీ ప్రోత్సహిస్తోందా.? అంటే అదీ లేదు. గత కొద్ది రోజులుగా నందమూరి – నారా – దగ్గుబాటి కుటుంబాల్లో
cపురంధేశ్వరి రాజకీయ భవిష్యత్తు గురించి చర్చ జరుగుతోందిట. ఈ క్రమంలోనే పురంధేశ్వరిని టీడీపీలోకి ఆహ్వానించాలని చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
కన్నా లక్ష్మినారాయణని బీజేపీ నుంచి టీడీపీలోకి చంద్రబాబు చాకచక్యంగా లాగేశారు. ఆయన జనసేన వైపు వెళ్ళాల్సి వున్నా, ఆయన్ని డైవర్ట్ చేయగలిగారు చంద్రబాబు.
అదే బాటలో తదుపరి వికెట్ పురంధేశ్వరిదేనని సమాచారం. రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.
పురంధేశ్వరి బీజేపీని కాదని టీడీపీలోకి వెళ్ళడం ఖాయమేనా.? ఏప్రిల్లో ముహూర్తమంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంత.? వేచి చూడాల్సిందే.