ఇది చరిత్ర: చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయాలి?ఏపీలో రాజకీయ విమర్శలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మీసాలు తిప్పడాలు,
తొడలు కొట్టడాలు, కొట్టుకుందా రండి అని సవాళ్లు విసరడాలు వంటి వాటితో మాస్ సినిమాని తలపిస్తున్నాయి. ఆ సంగతులు అలా ఉంటే…
అసలు చంద్రబాబుకు ఓటు ఎందుకు వెయ్యాలి అని ప్రశ్నిస్తున్నారు వైకాపా నేతలు!14ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చరిత్ర బాబు సొంతం.
ఎవరు అవునన్నా కాదన్నా… మోస్ట్ సీనియర్ పొలిటీషియన్స్ లో చంద్రబాబు ఒకరు. మరి అలాంటి వ్యక్తి ఈ వయసులో, ఇంత అనుభవం పెట్టుకుని..
ఓట్ల కోసం పరితపిస్తున్న విధానం, ఓట్లను అడుగుతున్న పద్దతి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.. ఆ ఓట్లు అడిగే విధానంలోనే తన ఫెయిల్యూర్ ని ఒప్పుకుంటున్నారని అంటున్నారు వైకాపా నేతలు!
“ఇంతకాలం నా పాలన చూశారు.. ఒకసారి అవకాశం ఇద్దామనుకుని జగన్ పాలన చూశారు.. ఇందులో మీకు ఏ పాలన నచ్చింది..? నాకు ఓటు వేస్తే మళ్లీ నాదైన మార్కు పాలనను తీసుకుని వస్తాను..
నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గతంలో ఏలా పాలించానో – ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశానో.. అచ్చు అలానే, అంత అద్భుతంగానే పాలిస్తాను” అని చెప్పి ఓట్లు అడగాల్సిన స్థాయి బాబుది!
కానీ… జగన్ సరిగ్గా పాలించడం లేదు, ఇంక నేను తప్ప మీకు మరో ఆప్షన్ లేదు.. కాబట్టి నాకే ఓటు వేయండి అన్నట్లుగా బాబు ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవాచేస్తున్నారు వైకాపా నేతలు.
దీంతో తాజాగా మైకందుకున్నారు ఏపీ మంత్రి సిదిరి అప్పలరాజు. కొట్టుకోడానికి లగ్నం పెట్టుకుందామని చంద్రబాబు సవాల్ విసురుతున్నారని, 23 సీట్లతో మూలన కూచోబెట్టడమే..
రాజకీయాల్లో బట్టలూడదీయడం అని సీదిరి వెటకరించారు. మరో ముహూర్తం ఎందుకు.. 2024 ఎన్నికల ముహూర్తంలో నువ్వో మేమో తేల్చుకుందాం అంటూ సవాల్ విసిరారు.
ఇదే సమయంలో.. విద్యుత్ ఛార్జీలు తగ్గించమని అడిగిన రైతుల్ని కాల్చి చంపిన చరిత్ర బాబుది అంటూ.. బషీర్ భాగ్ ఘటనను గుర్తుచేశారు అప్పలరాజు.
పక్క పార్టీల్ గెలిచిన ఎమ్మెల్యేలకు ప్యాకేజీలు ఇచ్చి తమ పార్టీలోకి నిస్సిగ్గుగా కండువాలు కప్పి లాక్కున చరిత్ర చంద్రబాబు ది… ఇప్పుడు కాపుల పాట పాడుతున్న
బాబు – నాడు ముద్రగడ కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా వేదించిన చరిత్ర కలిగి ఉన్నారంటూ.. సిదిరి ఫైరయ్యారు!
నోటుకు ఓటు కేసులో రాజధాని విడిచి పారిపోయిన వ్యక్తి.. పబ్లిసిటీ పిచ్చితో ప్రజల ప్రాణాలను హరించిన వ్యక్తి.. నిరుద్యోగులకు భృతి ఇస్తానంటూ హామీ ఇచ్చి,
కుర్చీ ఎక్కి.. అనంతరం ఆ హామీని గాలికొదిలేసి, నిరుద్యోగులను వెక్కిరించిన వ్యక్తి అంటూ… తదనుగునంగా సోషల్ మీడియాలో ఫైరవుతున్నారు వైకాపా కార్యకర్తలు!
ఇవన్నీ చూపిస్తూ.. గతమంతా గుర్తుచేస్తూ.. వాళ్లడుగుతున్న ప్రశ్న.. “చంద్రబాబుకు ఓటు ఎందుకు వేయాలి?” అని!