మాస్ గాడ్ నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా శృతి హాసన్ మరియు హానీ రోజ్ లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ సాలిడ్ చిత్రం “వీరసింహా రెడ్డి” కోసం తెలిసిందే.
దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ చిత్రం అయితే రీసెంట్ గానే ఓటిటి లో రిలీజ్ అయ్యింది.
ప్రముఖ ఓటిటి యాప్ డిస్నీ+ హాట్ స్టార్ లో పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం అందులో అయితే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుండగా..
తెలుగులో అయితే టాప్ 1 లో వీరసింహా రెడ్డి టాప్ 2 లో బాలయ్య ముందు సినిమా అయినటువంటి “అఖండ” చిత్రం రెండో స్థానంలో ట్రెండ్ అవుతుంది.
దీనితో బ్యాక్ టు బ్యాక్ బాలయ్య రెండు సినిమాలూ టాప్ లో ట్రెండ్ అవ్వడం విశేషం.ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే
అప్పుడెప్పుడో వచ్చిన అఖండ ఇప్పటికీ ట్రెండ్ లో ఉండడం ఆశ్చర్యకరం.
కాగా ఈ అఖండ సినిమాకి దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది.
ఇక ఈ సినిమాల తర్వాత అయితే బాలయ్య ఇప్పుడు దర్శకుడు అనీల్ రావిపూడి తో తన కెరీర్ లో 108వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రాన్ని కూడా బాలయ్య శరవేగంగా కంప్లీట్ చేసి రిలీజ్ చేయనున్నారు.
ఇంట్రెస్టింగ్ గా ఈ మూడు సినిమాలకి కూడా థమన్ సంగీతం అందివ్వడం విశేషం.