మన భారతీయ సంస్కృతిలో కొన్ని రకాల మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మొక్కలను దేవుళ్లతో సమానంగా పూజిస్తారు.
ఇలా పూజింపబడే మొక్కలలో సెమీ మొక్క కూడా ఒకటి. సాధారణంగా తులసి మొక్కని ఇంట్లో ఉంచి పూజిస్తూ ఉంటారు.
తులసి మొక్కను పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని ప్రజల నమ్మకం. అయితే సెమీ మొక్కను కూడా ఇంట్లో ఉంచి పూజించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి.
ఇంట్లో శమీ మొక్కను నాటడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయని, ఇంట్లో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.
కుటుంబ సభ్యులు సాడే సతితో బాధపడుతుంటే శమీ మొక్కను ఇంట్లో నాటడం వల్ల సాడే సతి ప్రభావం తగ్గుతుంది. అయితే సెమీ మొక్కను ఏ దిక్కున నాటాలి ?
ఏ రోజులలో నాటలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సెమీ మొక్కను ఇంట్లో నాటాలనుకునేవారు ఏ రోజునైనా నాటుకోవచ్చు.
కానీ శనివారం రోజున శమీ మొక్కను ఇంటికి తెచ్చుకుంటే శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు.
ఈ సెమీ మొక్కను ఇంటి ప్రధాన ద్వారం దగ్గర కుండీలో ఉంచడం వల్ల ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది.వాస్తు శాస్త్రం ప్రకారం సెమీ మొక్కను
ఇంటికి తూర్పు దిక్కున నాటితే శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించి ప్రతికూల శక్తి తొలగిపోతుంది.
ఇలా తూర్పు దిక్కున శమీ మొక్కను నాటడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఇంటికి ఐశ్వర్యం చేకూరుతుంది.
అయితే ఈ మొక్కను నాటే ప్రదేశం చాలా శుభ్రంగా ఉండాలి. అయితే దాని చుట్టూ చెత్త, ధూళిని సేకరించడానికి అనుమతించకూడదు.
ఇంటి ముందు మొక్కను నాటటానికి వీలు లేని వారు ఇంటి పైకప్పు మీద కూడా ఈ మొక్కను నాటవచ్చు. అయితే ఇంటి పైకప్పుపై శమీ మొక్కను నాటితే,
దానిని దక్షిణ దిశలో నాటడం శ్రేయస్కరం అని పండితులు చెబుతున్నారు. ఈ మొక్కని వాడిపోకుండ జాగ్రత్తగా చూసుకోవటం వల్ల ఇంట్లో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.