సాధారణంగా ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ప్రజలు లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం కోసం తపిస్తూ ఉంటారు. అయితే లక్ష్మీ దేవి ఎవరి దగ్గర స్థిరంగా ఉండదు..
అందుకే అమ్మవారిని ఇంట్లోకి ఆహ్వానించడానికి అనేక పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం నాడు కొన్ని నియమాలు పాటిస్తే
లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ దేవి ఇంట్లోకి రావడానికి పాటించాల్సిన 7 నియమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం.
ముఖ్యంగా ఇంటికి ప్రధాన ద్వారం సరైన దిశలో వాస్తు ప్రకారం ఉండటం చాలా ముఖ్యం. అంతేకాకుండా ప్రధాన ద్వారం దగ్గర కాంతి లేకపోతే లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టదు.
ప్రధాన ద్వారం వద్ద కాంతివంతంగా లేకుండా చీకటిగా ఉండటంవల్ల దరిద్ర దేవత ఇంట్లోకి అడుగుపెడుతుంది. అలాగే ఇంటి ముఖద్వారానికి అద్దాలు తలుపులకి గ్లాసులు వంటివి పొరపాటున కూడా పెట్టరాదు.
అందువల్ల ఇంటి ముఖద్వారం వద్ద అద్దాలు లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంటి గడప సరైన పరిమాణంలో ఉండాలి.
అందువల్ల ఇంటి ముఖద్వారం వద్ద అద్దాలు లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంటి గడప సరైన పరిమాణంలో ఉండాలి.
అలాగే ప్రతిరోజు గడప శుభ్రం చేసి పసుపు కుంకుమ తో అందంగా అలంకరించాలి. అప్పుడే లక్ష్మీదేవీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
అలాగే ఇంటి ముందు ప్రధాన తలుపు ఇంట్లోనే మిగతా అన్ని తలుపుల కంటే కొద్దిగా పెద్దగా ఉండేలా చూసుకోవాలి. ఆ తలుపులను లోపలి నుంచి తెరిచేలా ఉండాలి.
అలా తెరిస్తే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది. అలాగే ప్రతిరోజు ప్రధాన ద్వారం ముందు శుభ్రం చేసి రంగులతో ముగ్గులు వేయాలి . ఇలా వాకిలి ముగ్గుతో అందంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది.
అమ్మవారికి సంప్రదాయ ముగ్గులు అంటే చాలా ప్రీతికరం. ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి ఇంట్లోనే కొలువై ఉంటుంది. శుభ్రత లేని ఇంట్లో లక్ష్మి దేవి నిలబడదు.