ఎండాకాలం వచ్చిందంటే తీవ్రమైన వడగాలులతో ఒంట్లో తేమ మొత్తం ఆవిరై డిహైడ్రేషన్ సమస్యను ఎదుర్కోవడం మనందరికీ పెద్ద సవాలుగా మారుతుంది.
దానికి తోడు ఒంట్లో నీరు మొత్తం చెమట రూపంలో విసర్జించబడి భరించలేని చెమట దుర్వాసన మిమ్మల్ని మీతో పాటు మీ చుట్టూ ఉన్న వారిని ఇబ్బంది పెడుతుంది.
దాంతో చాలామంది నలుగురితో కలిసి కూర్చొని మాట్లాడడానికి సంకోచిస్తుంటారు. అసలు చెమట దుర్వాసన ఎక్కువగా ఉండడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాఫీ ఎక్కువగా తాగితే చెమట దుర్వాసనకు కారణం అవుతుందట. వినటానికి ఆశ్చర్యంగా ఉంది కదా కాఫీలో ఉండే ఆల్కలాయిడ్స్ ఎల్లప్పుడూ
చెమట గ్రందులను యాక్టివ్ గా ఉంచుతాయి కావున చెమట ఎక్కువగా విసర్జించబడుతుంది. మరియు కాఫీలో ఉండే యాసిడ్ లక్షణాలు చెమట దుర్వాసనకు కారణం అవుతుందని చెబుతున్నారు.
వెల్లుల్లి, ఉల్లిపాయలను ఎక్కువగా తింటే వీటిలో ఉండే సల్ఫర్ మూలకాలు ఒంట్లో చెమటతో చర్య జరిగినప్పుడు చెమట దుర్వాసనకు కారణం అవుతాయి.
జంక్ ఫుడ్ ఎక్కువగా తినేవారిలో చెమట దుర్వాసన ఎక్కువగా వస్తుంది కారణం జంక్ ఫుడ్ లో ఉండే కెమికల్స్, సోడియం, అత్యధిక గ్లైసమిక్ ఇండెక్స్ చెడు వాసనకు కారణం అవుతుంది.
చేపలను తింటే చమట దుర్వాసన వస్తుంది.కొంతమందిలో చేపల్లో ఉన్న ప్రోటీన్స్ విచ్ఛిన్నం చేసే శక్తి జీర్ణ వ్యవస్థకు ఉండదు దాని మూలంగా కూడా చెమట దుర్వాసన వస్తుంది.
చూయింగ్ గమ్ ఎక్కువగా నమిలే వారిలో కూడా చెమట దుర్వాసన ఎక్కువగా ఉంటుందట. క్యాబేజీ, బ్రోకలీ, కాలిఫ్లవర్ వంటివి ఎక్కువగా తింటే
మన ఆరోగ్యానికి చాలా మంచిది ఒంట్లో విషపు వ్యర్థాలను బయటికి పంపడంలో సహాయపడతాయి కావున ఒంట్లో విష వ్యర్ధాలు చెమట ద్వారా విసర్జించబడినప్పుడు చెడు వాసనకు కారణమవుతాయి.
అలాగే ఆల్కహాల్ సేవించే వారిలో కూడా చెమట దుర్వాసనకు కారణం అవుతుంది. తరచూ నీళ్లను ఎక్కువగా తాగుతుంటే చెమట దుర్వాసన నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది.
వేసవిలో చెమటలు పట్టడం మరింత అధికంగా ఉంటుంది కాబట్టి రోజుకు రెండు మూడు సార్లు స్నానం చేస్తే చెమట దుర్వాసనను వదిలించుకోవచ్చు