నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలు లైన్ లో పెట్టడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి న్యాచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమా విడుదలకు రంగం సిద్ధమవుతోంది.
ఈ సినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపద్యంలోనే ఆయన సినిమాలు లైన్ అప్ చూస్తే ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పక తప్పదు.
ఈ సినిమా పూర్తయిన వెంటనే నాని కొత్త దర్శకుడు శౌర్యవ్ దర్శకత్వంలో ఒక సినిమా ఒప్పుకున్నాడు.
మైత్రి మూవీ మేకర్స్ నుంచి బయటకు వచ్చేసిన చెరుకూరి మోహన్ కొత్తగా వైరా ప్రొడక్షన్స్ అని ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేయడంతో ఆ ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాడు నాని.
ఆ సినిమా పూర్తి అయిన వెంటనే తన సొంత నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో నాని హిట్ 2 సినిమా చేయబోతున్నాడు.
ఆ సినిమాలో అర్జున్ సర్కార్ అనే ఒక పోలీస్ అధికారి పాత్రలో ఆయన కనిపించబోతున్నట్లు ఇప్పటికే హిట్ 2లో క్లారిటీ వచ్చేసింది.v
ఇక తాజాగా ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ సినిమా డివీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద
డివివి దానయ్య నిర్మించబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా నానితో ఒక సినిమా ఫైనల్ చేసిందని చెబుతున్నారు.
ఈ సినిమా మాత్రమే కాదు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కూడా హీరో నానితో ఒక సినిమా ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక రకంగా చూస్తే నాని మార్కెట్ ను పెద్దగా ప్రభావితం చేయకపోయినా
ఆయనకు మాత్రం వరుస సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉండడం హాట్ టాపిక్ గా మారుతుంది.
ఇక నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్గా తెరకెక్కిన దసరా సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన
ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప లాగానే రా అండ్ రస్టిక్ గా కనిపిస్తున్న ఈ సినిమా కూడా
పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ సినిమా నానికి బాగా ప్లస్ అవుతుందని అంటున్నారు.