సినీ నటుడు మంచు మనోజ్ పెళ్ళి చేసుకోబోతున్నాడు. గతంలోనే ఆయనకు వివాహం జరగ్గా,
వైవాహిక జీవితంలో ఏర్పడ్డ మనస్పర్ధల కారణంగా మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు మంచు మనోజ్.
గత కొద్ది రోజులుగా మంచు మనోజ్ పెళ్ళికి సంబంధించి రకరకాల గాసిప్స్ వినిపిస్తూ వస్తున్నాయి.
మాజీ మంత్రి, టీడీపీ నేత భూమా అఖిలప్రియ సోదరిని మంచు మనోజ్ పెళ్ళి చేసుకోబోతున్నాడన్నది ఆ గాసిప్స్ సారాంశం.
ఆమె పేరు మౌనిక. మౌనికా రెడ్డికి కూడా గతంలో పెళ్ళి జరిగింది.. ఆమె కూడా వైవాహిక జీవితంలో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకున్నారు.
మనోజ్ – మౌనిక గత కొంతకాలంగా ఒకర్నొకరు ఇష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇద్దరూ కలిసి వున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
మరోపక్క, మార్చి 3న వీరిద్దరి వివాహానికీ ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
అత్యంత సన్నహితులకు మాత్రమే ఈ వేడుకకు ఆహ్వానించే అవకాశం వుందట. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.