ఎప్పుడు పడితే అప్పుడు గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?

 ప్రతిరోజు గ్రీన్ టీ సేవిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది నిపుణులు చెబుతుంటారు.గ్రీన్ టీ లో ఉండే సహజ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు,

 యాంటీ ఏజింగ్ గుణాలు శరీరంలో మెటబోలిజం వృద్ధి చేయడం ద్వారా రోజంతా మిమ్మల్ని చురుగ్గా, చలాకీగా ఉంచడంలో తోడ్పడుతాయి. అలాగే శరీరంలో చెడు వ్యర్ధాలను తొలగించి

 మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. కావున ప్రతిరోజు గ్రీన్ టీ సేవిస్తే ఆరోగ్యానికి మంచిదే

 అయితే గ్రీన్ టీ తాగే విషయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలని నిపుణులు చెప్తున్నారు.

 గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదన్నారని ఎప్పుడు పడితే అప్పుడు తాగడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలా తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు.

 సమయం సందర్భం లేకుండా గ్రీన్ టీ సేవిస్తే తీవ్ర అనారోగ్యం సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే అల్పాహారం తర్వాత ఒక కప్పు గ్రీన్ టీ నిక్షేపంగా తాగొచ్చు

 మరియు లంచ్‌కు గంట ముందు లేదా సాయంత్రం స్నాక్స్ తో కలిపి తీసుకుంటే గ్రీన్ టీ నుంచి అదనపు ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

 గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ తొలగించి క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 మరియు రక్తంలో గ్లూకోస్ స్థాయిలను నియంత్రించి షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది.

 ప్రతిరోజు సమయం సందర్భం లేకుండా గ్రీన్ టీ సేవించిన మరియు ఒక రోజులో నాలుగు కప్పుల మించి గ్రీన్ టీ సేవిస్తే మన ఆరోగ్యం పై వ్యతిరేక ప్రభావం చూపి

 జీర్ణ సంబంధిత సమస్యలు,కడుపులో మంట, గ్యాస్,తలనొప్పి, కళ్ళు తిరగడం, ఆందోళన, నిద్రలేమి సమస్య, ఎనీమియా, బ్లీడింగ్ డిసార్డర్,

 లివర్ సమస్య, ఎముక బోలు వ్యాధి, డయేరియా, కండరాల క్షీణత, నాడీ వ్యవస్థ క్షీణత వంటి చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.