మన శరీర నిత్య జీవక్రియలు సక్రమంగా జరగాలంటే అన్ని రకాల ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఖనిజ లవణాలు సమ పరిమాణంలో ఉండాలి.
అలాకాకుండా ఎక్కువైనా, తక్కువైనా అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు కొన్ని ఆహార పదార్థాలు రుచిగా ఉన్నాయని
తెలియకుండానే మోతాదుకు మించి తినేస్తుంటాం దాని ఫలితంగా కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ద్రాక్షను తినే విషయంలో కూడా ఇలాంటి పొరపాట్లు చేస్తుంటారు. ద్రాక్షను అతిగా తింటే కలిగే అనర్థాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ద్రాక్ష పండ్లు ఆకర్షణీయమైన రంగుల్లో రుచికి తీపి, పులుపు,వగరు కాంబినేషన్లో అద్భుతంగా ఉంటుంది. అలాగని మోతాదుకు మించి తింటే
వీటిల్లో ఉండే ఓ రకమైన ప్రోటీన్ కొందరిలో తీవ్ర అలర్జీలకు కారణమై తలనొప్పి, కడుపు మంట, జలుబు, వాంతులు, విరోచనాలు, పైత్యం శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి తలెత్తుతాయి.
అందుకే వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అతి బరువు సమస్యతో బాధ పడేవారు ద్రాక్ష పండ్లను అతిగా తింటే
మన శరీరానికి అదనపు క్యాలరీలు లభించి శరీరం బరువు నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉంది.
ద్రాక్షలో అత్యధికంగా ఉండే కార్బోహైడ్రేట్స్ రక్తంలో గ్లూకోస్థాయిలను పెంచి డయాబెటిస్ వ్యాధి నియంత్రణ కోల్పోతుంది.ద్రాక్ష పండ్లను ఖాళీ కడుపుతో
తింటే ఉబ్బరం, గ్యాస్ట్రిక్, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి కారణం ద్రాక్షలో ఆమ్లత్వ గుణాలు అధికంగా ఉండడం వల్ల పొట్టలో యాసిడ్ రిఫ్లెక్షన్ కారణంగా ఈ సమస్యలన్నీ తలెత్తుతాయి.
ద్రాక్షలో అత్యధికంగా పీచు పదార్థం (ఫైబర్) ఎక్కువ మొత్తంలో ఉంటుంది వీటిని అధికంగా తింటే జీర్ణం అవడంలో సమస్య తలెత్తి మలబద్ధక సమస్యతో బాధపడాల్సి వస్తుంది.