ప్రస్తుత కాలంలో మనిషి జీవితం డబ్బు మీద ఆధారపడి ఉంది. డబ్బు ఉంటేనే ఈ సమాజంలో విలువ ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు.
అయితే కొంతమంది ఎంత కష్టపడి పని చేసినా కూడా సంపాదించిన డబ్బు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది. దీంతో తరచూ ఆర్థిక సమస్యలు వేధిస్తూ ఉంటాయి.
అయితే ఈ ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారు లక్ష్మీదేవిని పూజించటమే కాకుండా
కొన్ని నియమాలు పాటించటం వల్ల కూడా ఆ దేవి అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతుల అవటానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శుక్రవారం రోజు లక్ష్మి దేవికి ప్రీతికరమైన రోజు. అందువల్ల ఆరోజున ఒక మట్టి జాడిని తీసుకొని లక్ష్మీదేవికి పూజ చేసి నైవేద్యం సమర్పించాలి. ఆ తరువాత ఒక రాగి లేదా ఇతడి ప్లేట్ తీసుకొని
ఈ ప్లేట్లో కొత్త పసుపు వస్త్రాన్ని ఉంచాలి. ఆ తరువాత ఈ వస్త్రానపై 9 వక్కలను, ఒక పసుపు కొమ్మును ,వెండి లేదా బంగారంతో చేసిన ఉంగరాన్ని లేదా నాణాన్ని ఉంచి మూట కట్టాలి.
తరువాత ఈ మూటను మట్టి జాడీలో అడుగు బాగానే ఉంచి దానిపైన రాళ్ల ఉప్పును పోయాలి. ఈ విధంగా మట్టి జాడీలో పోసిన రాళ్ల ఉప్పును వంటల్లో కూడా ఉపయోగించవచ్చు.
ఇలా చేయటం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనవంతులు అవుతారు. ఒకవేళ బంగారు వెండి తో తయారు చేసిన ఉంగరాలు నాణ్యాలు లేకపోయినా కూడా
ఒక చిన్న ముక్క బంగారం ని అందులో వేసి ముడి వేయడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఉప్పుని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందువల్ల ఉప్పుని ఎవరికి దానం చేయకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు.
అలాగే సాయంత్రం వేళల్లో కూడా ఉప్పుని ఇంటి నుండి బయటకు తీసుకువెళ్లకూడదు. ఇలా చేయటం వల్ల మనమే స్వయంగా లక్ష్మీదేవిని ఇంటి నుండి బయటకు పంపించినట్లు అవుతుంది.
అలాగే ఒప్పుని ఎక్కడపడితే అక్కడ పారేయటం వల్ల కూడా ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఉప్పుని విసిరేయటం వల్ల
ఆ లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. అందువల్ల పొరపాటున కూడా ఉప్పుని ఎవరికైనా దానం చేయటం లేదా పారేయటం వంటి పనులు చేయకూడదు.